శీతాకాల విడిది కోసం హైదరాబాద్ వచ్చిన రాష్ట్రపతి రామనాథ్ కోవింద్ రాష్ట్ర ప్రముఖులకు విందు ఏర్పాటు చేశారు. బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో ఎట్ హోం కార్యక్రమం నిర్వహిస్తున్నారు. గవర్నర్ నరసింహన్ దంపతులు, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు, శాసన సభాపతి మధుసూదనాచారి, శాసన మండలి అధ్యక్షుడు స్వామిగౌడ్, ఉప సభాపతి పద్మా దేవేందర్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఉన్నతాధికారులు, పలువురు ప్రముఖులు హాజరయ్యారు.