వైసీపీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇవాళ క్రిస్మస్ పర్వదినం సందర్బంగా పాదయాత్రకు విరామం ప్రకటించారు. తిరిగి మంగళవారం పాదయాత్ర ప్రారంభంకానుంది. . ప్రస్తుతం కదిరి నియోజకవర్గంలో జగన్ పర్యటిస్తున్నారు. తిరిగి గాండ్ల పేట నుంచి జగన్ పాదయాత్ర మంగళవారం నుంచి జరుగుతుంది. నిన్నటివరకు వరకూ జగన్ 600కిలోమీటర్ల మేర పాదయాత్ర చేశారు. ఇప్పటి వరకూ కడప, కర్నూలు, అనంతపురం జిల్లాలో పర్యటించిన జగన్.. మంగళవారం సాయంత్రానికి ఆయన అనంతపురం జిల్లాలో పాదయాత్ర ముగించుకుని ముఖ్యమంత్రి సొంత జిల్లా చిత్తూరులోకి చేరుకుంటారు. సీఎం సొంత జిల్లా కావడంతో అక్కడ పాదయాత్రను విజయవంతం చేయడానికి వైసీపీ నేతలు తీవ్రంగా శ్రమిస్తున్నారు. చిత్తూరు జిల్లాలో కూడా జగన్ పాదయాత్ర దాదాపు 250కిలోమీటర్లు సాగనుంది. ఎనిమిది నియోజకవర్గాల్లో పర్యటించనుంది.బహిరంగసభలకు పెద్దయెత్తున జనం తరలి వస్తుండటంతో నూతనోత్సాహంతో జగన్ ముందుకు వెళుతున్నారు.