ఆర్కే నగర్ ఉప ఎన్నికల్లో తలపడి తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని భావించి విఫలమైన దక్షిణాది హీరో విశాల్ సంచలన ప్రకటన చేశాడు. ఆర్‌కే నగర్ ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన దినకరన్‌కు తాను అండగా ఉంటానని నటుడు విశాల్ పేర్కొన్నారు. ఆ నియోజకవర్గం ప్రజల ప్రధాన సమస్యల పరిష్కారంలో తాను ఆయనకు అన్ని విధాలా సహకరిస్తాననిని తెలిపారు. ఈ మేరకు విజయం సాధించిన దినకరన్ కు తన హృదయ పూర్వక అభినందనలు అని తెలుపుతూ ట్వీట్ చేశాడు.
My Hearty Congratulations & Best Wishes to Mr @TTVDhinakaran
Hoping that all the pressing issues of RK Nagar will be addressed by Mr TTV Dinakaran in the near future & such circumstances my full support is guaranteed for Mr TTV Dinakaran. God Bless !!@VishalKOfficial pic.twitter.com/xZj9yfNJIU
— Vishal (@VishalKOfficial) December 24, 2017