ఏపీలో అధికార పార్టీ నాయకులు ఎక్కడ ఖాళి స్థలం దొరికితే అక్కడ భూకబ్జా చేస్తున్నారు. హత్యలు..రౌడియిజం..దోపిడి ఏది వదలకుండా అన్ని నేరాలు చేస్తున్నారు తెలుగు తమ్ముళ్లు. అందుకు ఉదాహరణ… చెరుకులపాడు నారయరెడ్డి హత్య…డోన్ లో రాడ్లతో వైసీపీ కార్యకర్తలపై పట్టపగలు దాడి…ఇలా చెప్పుకుంటూపోతే ఎన్నో ఉన్పాయి.
అయితే తాజాగా కర్నూల్ జిల్లా తుగ్గలి మండల నాయకుడు కే.ఈ క్రిష్ణమూర్తి ముఖ్య అనుచరుడు తుగ్గలి నాగేంద్ర పై తిరుచానూరు పోలీస్ స్టేషన్ పరిదిలో కేసు నమోదు అయ్యింది. ఉపముఖ్యమంత్రి పేరు చెప్పి భూ ఆక్రమణ చేసినట్లు సమచారం. దీనిపై బాదితులు తిరుచానూరు పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేశారు. ఈ విషయం తెలుసుకున్న నిందితులు పరారీలో ఉన్నారు. A1 ముద్దాయిగా తుగ్గతి నాగేంద్ర కూమర్ , A2 పార్థసారతి , A3 దామోదర్ గా గుర్తించారు.