ఏపీలో కొంతమంది టీడీపీ సీనియర్ నాయకులు పలు కారణాలవల్ల చనిపోతున్నారు. తాజాగా టీడీపీ సీనియర్ నాయకుడు హఠాన్మరణం చెందారు. అనంతపురం జిల్లాలోని పామిడి మండలం ఎద్దులపల్లి గ్రామానికి చెందిన రాజారెడ్డి అనే టీడీపీ నాయకుడు సోమవారం ఉదయం గుండెపోటుతో మృతిచెందారు. సమాచారమందుకున్న మాజీ మంత్రి, ప్రభుత్వ విప్ పల్లె రఘునాథరెడ్డి సంతాపం తెలిపారు. అలాగే విషయం తెలుసుకున్న పలువురు కార్యకర్తలు ఎద్దులపల్లికి చేరుకుంటున్నారు.
