సినీ ఇండస్ర్టీలో లైంగిక దాడులు జరుగుతాయని పలువురు హీరోయిన్లు మీడియా ఎదుట బాహాటంగా బయటపెడుతున్నా.. వాటిని సినీ పెద్దలు పట్టించుకోకుండా.. లైట్ తీసుకోవడంతో సినీ కామాంధులు హీరోయిన్లనే కాకుండా.. నటులపై కూడా వారి కామకోరలను విసురుతున్నారు. దీంతో లైంగిక దాడులు ఆగకపోగా.. రోజు రోజుకు పెరుగుతూనే ఉన్నాయి.
అయితే, తాజాగా ఇటువంటి సంఘటనే మళ్లీ వెలుగు చూసింది. లఘు చిత్ర దర్శకుడినంటూ హారికను మోసం చేసిన కేసు విచారణలో పో లీసులకు పలు సంచలనాత్మక విషయాలు వెలుగు చూస్తున్నాయి. అయితే, యోగి కేవలం హారికనే కాకుండా.. ప్రముఖ నటుడు జేడీ చక్రవర్తి భార్యపై కూడా లైంగిక దాడికి పాల్పినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. 2016 జులైలో అను కీర్తి అనే నటి వద్ద డబ్బులు తీసుకుని.. పైగా డబ్బు తిరిగి ఇవ్వకపోగా లొంగదీసుకుని అత్యాచారానికి కూడా పాల్పడ్డాడని ఈ విషయం పోలీసుల విచారణలో వెల్లడైంది. హారిక ఫిర్యాదుతో యోగిని అరెస్టు చేసిన పోలీసులు.. తమదైన శైలిలో విచారణ చేస్తున్నారు. దీంతో ఒక్కొక్కటిగా యోగి లీలలు బయటకు వస్తున్నాయి. పోలీసుల ఎదుటే కేసు పెట్టిన హారికను అసభ్యకరంగా ధూషించడంతో.. యోగిపై పోలీసులు వారి చేతికి పనిచెప్పారు. ఈ కేసుకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.