రాష్ట్ర వ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరుగుతున్న విషయం తెలిసిందే . ఈ క్రమంలో క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రార్థన చేసేందుకు ఓ వ్యక్తి సరూర్‌నగర్‌లోని చర్చికి వచ్చాడు. కాగా ప్రార్థన చేస్తున్న సమయంలో ఆ వ్యక్తికి మూర్ఛరావడంలో కిందపడిపోయాడు. దీంతో అతడి తలకు బలమైన గాయమైంది. వెంటనే అప్రమత్తమైన రాచకొండ ట్రాఫిక్ పోలీసులు ఆ వ్యక్తిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించి తమ మానవత్వం చాటుకున్నారు . తమ పోలీసు వాహనంలోనే వ్యక్తిని ఆస్పత్రికి తరలించి, దగ్గరుండి మరీ చికిత్స చేయించిన పోలీసులనుఅక్కడున్న ప్రజలు అభినందించారు.