కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ, నయనతార హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం జై సింహా. అయితే, ఈ చిత్రానికి సంబంధించిన ఆడియో రిలీజ్ వేడుక ఆదివారం విజయవాడలో జరిగింది. ఈ ఆడియో ఫంక్షన్లో పాల్గొన్న సినీ హీరో, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, ఏపీ ఐటీశాఖ మంత్రి నారా లోకేష్ లు ఒకరిపై మరొకరు ప్రశంసల వర్షం కురిపించుకున్నారు.
ఈ సందర్భంగా బాలకృష్ణ తన అల్లుడు గురించి మాట్లాడుతూ.. మామూలుగా అయితే, ఇంట్లో ఉన్నప్పుడో.. బయట ఉన్నప్పుడో.. నారా లోకేష్‌ను అల్లుడని పిలుస్తాను లేదా మేనల్లుడని పిలుస్తుంటాను.. కాకపోతే ఇవాళ వేదికపై ఉన్నాడు కాబట్టి మంత్రి అని పిలవక తప్పలేదు అంటూ చమత్కరించారు. నారా లోకేష్ యువకుడు, మంచి ఉత్సాహం, మంచి అవగాహన ఉంది. నాకు కూడా ఇంత మంచి అల్లుడు దొరికినందుకు, అలాగే, ఆంధ్రప్రదేశ్ కూడా ఒక మంచి మంత్రి లభించడం అదృష్ణమన్నారు. ఏపీని అభివృద్ధిఆలో ముందుకు తీసుకెళ్లాలని కోరారు. టీడీపీలోకి కుర్రాళ్లు రావాలి. కొత్త కొత్త ఆలోచనలతో రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోవాలి అంటూ బాలకృష్ణ తన ప్రసంగానని ముగించారు.