గ్లామర్ డాల్ సమంత చాలా వరకు మారిపోయిందండోయ్. అయితే, తనను అక్కినేని హీరో, భర్త నాగచైతన్య మార్చాడా..? లేక అత్త అమల మార్చిందో తెలీదు కానీ.. చాలా నిండుగా ఉన్న వస్ర్తాలను ధరించి మీడియా కంట పడుతోంది లిప్ లాక్‌కు అక్కినేని వారి కోడలు
సమంత. దీనికి ఉదామరణ ఇటీవల జరిగిన హలో మూవీ ఆడియో ఫంక్షనే. అయితే, పెళ్లికి ముందు తాను సైన్ చేసిన సినిమాలను పూర్తి చేసే పనిలో ముగినితేలుతోంది సమంత.
అయితే, అసలు విషయానికొస్తే. సమంత హీరోయిన్‌గా తాజాగా నటిస్తున్న సినిమాలు ఒకటి రంగస్థలం కాగా, మరొకటి మహానటి.
ఇక్కడే సమంతకు అసలు చిక్కొచ్చిపడింది. సుకుమార్ దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ హీరోగా సమంత హీరోయిన్‌గా నటిస్తున్న చిత్రం రంగస్థలం. ఈ చిత్రంలో సన్నివేశానికి తగ్గట్టు హీరోయిన్‌తో ఓ లిప్‌లాక్ సీన్‌ను రెడీ చేశారట దర్శకుడు త్రివిక్రమ్. ఈ విషయాన్ని కాస్తా సమంతకు తెలపడంతో.. ఆ సన్నివేశానికి సమంత నో చెప్పేసిందట. పెళ్లి అయిన తరువాత ఎక్స్‌పోజింగ్, లిప్ లాక్ వంటి సీన్లలో నటిస్తే.. ఫ్యామిలీకి మంచిది కాదని, చెడ్డ పేరు వస్తుందని డిసైడ్ అయి నో చెప్పేసిందట. ఈ విషయం అక్కినేని ఫ్యాన్స్ చెవిన పడటంతో కోడలు చేసిన పనికి చాలా హ్యాపీగా ఫీలయ్యారట. అయితే, మరో చిత్ర మహానటితో సమంతకు ఎటువంటి ఇబ్బంది లేకపోవడం గమనార్హం. ఈ విషయం కాస్తా నెట్టింట్లోకి ఎక్కడంతో సమంత అత్త అమలుచాటు కోడలే..! నంటూ కామెంట్లు పెట్టేస్తున్నారు నెటిజన్లు.