తెలంగాణ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డిపై కాంగ్రెస్ నేత రేవంత్‌రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేసిన సంగతి సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రేవంత్‌రెడ్డి తీరును రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ తప్పుబట్టారు.
రేవంత్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ లేదా టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి స్పందించాలని మంత్రి డిమాండ్ చేశారు. కేబినెట్ మంత్రిగా ఉన్న నాయకుడిపై ఇలా అనుచిత వ్యాఖ్యలు చేయడం దారుణమని మండిపడ్డారు.ప్రధాని మోదీపై ‘నీచ్’ వ్యాఖ్యలు చేసిన మణిశంకర్ అయ్యార్‌పై కాంగ్రెస్ పార్టీ చర్య తీసుకుందని, ఆ సంప్రదాయన్ని గుజరాత్‌కే పరిమితం చేస్తుందా? లేక తెలంగాణకు కూడా పాటిస్తారో చూడాలని ట్వీట్ చేశారు.
It is for Rahul Gandhi Ji or Uttam Kumar Reddy Garu to respond to this cheap, crass & downright ridiculous utterances towards a respectable cabinet minister in Telangana
They were swift with Manishankar Aiyar’s behaviour but let’s see if it was selective to Gujarat elections https://t.co/AhMo0ys4It
— KTR (@KTRTRS) December 25, 2017