శాంతిభద్రతల పరిరక్షణలో తెలంగాణ పోలీస్ అనుసరిస్తున్న త్రిముఖ వ్యూహం సక్సెస్ అయిందని విశ్లేషకులు అంటున్నారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత పోలీసు వ్యవస్థను పూర్తిగా ఆధునికీకరించింది. నిధులు, నియామకాలకు ప్రభుత్వం పెద్ద పీట వేస్తున్న విషయం విదితమే! ఈ క్రమంలోనే పీపుల్ ఫ్రెండ్లీ పోలీసు అనే నినాదాన్ని తీసుకొచ్చింది. పోలీసులంటే ప్రజలు వణికిపోవాల్సి న అవసరంలేదని, ఇతర ప్రభుత్వ శాఖల తరహాలోనే పోలీసు శాఖ ప్రజలకు సేవలు అందించే ఒక శాఖ తరహాలోనే ఉండాలనే అభిప్రాయంతో ప్రభుత్వం ఉంది. అందుకు అనుగుణంగా చాలా మార్పులు తీసుకొచ్చింది. పోలీసు అధికారు లు, సిబ్బంది ఆలోచనా విధానంలో మార్పులు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నది. గొడవలు, కొట్లాటలు, ఘర్షణలు జరిగిన తర్వాత కేసులు న మోదుచేయడం కన్నా అవి జరగకుండానే ముందస్తు చర్యలు తీసుకుంటే మేలనే అభిప్రాయం సర్వత్రా ఏర్పడింది.
ఈ నేపథ్యంలో ఆయా జిల్లాల్లో ఎస్పీలు, కమిషనర్లు ఫ్రెండ్లీ పోలీసు సిస్టమ్‌ను పకడ్బందీగా అమలు చేసేందుకు కృషి చేస్తున్నారు. పోలీసులు సాధ్యమైనంత మేరకు ప్రజలకు దగ్గరగా మెలగాలని, పోలీసులపై ప్రజలకు నమ్మకం కలగాలనే లక్ష్యంతో పనిచేస్తున్నారు. ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకోవడం, వాటిని ప రిష్కరించడం, అవసరాలను గుర్తించడం… అం దుకు అనుగుణంగా చర్యలు చేపట్టడం లాంటి కార్యక్రమాలు చేస్తున్నారు. శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసుల చర్యలు ఎంత ముఖ్యమో… ప్రజల సహకారం అంతే ముఖ్యం. సీసీ కెమెరా లు ఏర్పాటు చేసుకోవడం, అపరిచిత వ్యక్తుల వి షయంలో అప్రమత్తంగా ఉండడం, ఏదైనా అనుమానం వస్తే పోలీసులకు సమాచారం అందించ డం లాంటి చొరవను ప్రజలు తీసుకోవడం ద్వా రా మరింత మేలు కలుగుతుంది.
మరోవైపు ఇటీవలి కాలంలో ఆన్‌లైన్ బ్యాంకింగ్ ద్వారా మోసాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఎవరో అజ్ఞాత వ్యక్తులు బ్యాంకు నుంచి ఫోన్ చేసి ఏటీఎం కార్డు నెంబర్ అడగడం, ఓటీపీ నెంబర్ అడగడం లాంటివి చే స్తున్నారు. బ్యాంకు ఖాతాలను లూటీ చేస్తున్నా రు. ఈ తరహా సమస్యలపైనా పోలీసులు ప్రజలకు అవగాహన కలిగిస్తుండడం విశేషం. ప్రజలకు ఆస్తి నష్టం, ఆర్థిక నష్టం జరగకుండా ఉండేందుకు ఈ చర్యలు దోహదపడుతున్నాయి.