ఎస్సీలపై అభ్యంతర వ్యాఖ్యలు చేసినందుకు గానూ వాల్మీకి సంఘ కార్యకర్తలు బాలీవుడ్ నటులు సల్మాన్ ఖాన్, శిల్పా శెట్టిలపై కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా దీనిపై శిల్పా శెట్టి ట్విటర్ ద్వారా స్పందిస్తూ క్షమాపణ చెప్పారు.‘ఓ ఇంటర్వ్యూలో నా మాటలను తప్పుగా అర్థంచేసుకున్నారు. నేను ఎవ్వరినీ కించపరిచేలా మాట్లాడలేదు. నా వ్యాఖ్యలు ఇబ్బంది కలిగించి ఉంటే నన్ను క్షమించండి. విభిన్న మతాలు, జాతులకు ప్రతీకైన భారతదేశంలో నేను పుట్టినందుకు గర్విస్తున్నాను. అన్ని మతాలపై గౌరవం ఉంది’ అని శిల్పా ట్వీట్‌లో పేర్కొన్నారు. ఈ విషయంపై సల్మాన్ ఇంకా స్పందించలేదు. దాంతో ఆయన నటించిన‘టైగర్ జిందా హై’ సినిమాను చూడనివ్వమంటూ వాల్మీకి కార్యకర్తలు ఆందోళనలు చేపడుతున్నారు.
