తమిళనాడుతో పాటు దేశ వ్యాప్తంగా ఆసక్తిగా ఎదురుచూస్తున్న చెన్నైలోని ఆర్కే నగర్ ఉపఎన్నికల్లో టీటీవీ దినకరన్ విజయం దిశగా దూసుకుపోతున్నారు. స్పష్టమైన ఆధిక్యతతో ముందుకు వెళుతున్నారు. దినకరన్ కు ఇప్పటి వరకూ 68,302ఓట్లు, అన్నాడీఏంకే 36,211 ఓట్లు, డీఎంకే కు 17,204 ఓట్లు వచ్చాయి. దినకరన్ విజయం ఖాయంగా కన్పిస్తోంది. ఏ రౌండ్ లోనూ అధికార పార్టీ ఆధిక్యతను కనపర్చలేదు. ఇక డీఎంకే మూడో స్థానంలోనే ఉంది. దినకరన్ మాత్రం భారీ ఓట్ల మెజారిటీతో గెలిచే అవకాశాలు కన్పిస్తున్నాయి.