తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి…సబ్బండ వర్గాల సంక్షేమానికి తెలంగాన ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ తెలిపారు. రవీంద్రభారతిలో తెలంగాణ డెవలప్‌మెంట్ ఫోరమ్-USA ఆధ్వర్యంలో 5వ ప్రవాసి తెలంగాణ దివస్ జరిగింది. మండలి చైర్మెన్ స్వామి గౌడ్, ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, ప్రముఖ కవి, రచయి అందె శ్రీ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ మాట్లాడారు.
తెలంగాణ సంస్కృతిని కాపాడటానికి అనేక సంస్థలు పుట్టాయని అందులో టీడీఎఫ్ యూఎస్ఏ ఒకటని ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ తెలిపారు. తెలంగాణ రాష్ట్రం రావాలి.. వచ్చిన తెలంగాణ అభివృద్ధి కావాలనే లక్ష్యంతో టీడీఎఫ్ ప్రారంభం అయిందని వివరించారు. రాష్ట్ర అభివృద్ధిలో తాము కూడా భాగం కావాలని టీడీఎప్ యూఎస్ఏ అనుకుంటోందని ఇది సంతోషకరమని అన్నారు. ఎన్నారైల భాగస్వామ్యం తీసుకుంటామని..వారి సంక్షేమానికి కూడా కట్టుబడి ఉన్నామని ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ ప్రకటించారు.
కీలకమైన విద్య, వైద్య రంగాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ స్పష్టం చేశారు. హైదరాబాద్ చుట్టూ నాలుగు ప్రధాన హాస్పిటల్ ఏర్పాటుచేయాలని ప్రభుత్వం సిద్ధమయిందన్నారు. గురుకుల పాఠశాలలతో అద్భుతమైన విద్యను అందిస్తోందని తెలిపారు. తెలంగాణలోని కోటి ఎకరాల మాగాణికి నీళ్లందించాలనే లక్ష్యంతో ప్రాజెక్టులను రీ డిజైన్‌ను ప్రభుత్వం చేపట్టి విజయవంతంగా ముందుకుతీసుకుపోతోందని ఆయన వివరించారు. అభివృద్ధిలో అంతా కలిసి రావాలన్నారు.