నంద్యాల ఉప ఎన్నికలకు ముందు శిల్పా చక్రపాణి రెడ్డి టీడీపీని వీడి వైసీపీలో చేరారు. ఆ సమయంలో ఆయన తన శాసన మండలి సభ్యత్వానికి రాజీనామా చేశారు. దానిని ఆమోదించారు. దీనిపై చర్చించేందుకు అమరావతిలో చంద్రబాబు కర్నూలు జిల్లా నేతలతో భేటీ అయ్యారు.శిల్పా చక్రపాణి రెడ్డి రాజీనామా ఆమోదం నేపథ్యంలో కర్నూలు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిపై చర్చించారు.
ఆ ఉప ఎన్నిక రేసులో కేఈ ప్రభాకర్ రెడ్డి, శివానంద రెడ్డి, శ్రీధర్ రెడ్డి, విష్ణు వర్ధన్ రెడ్డి, సజ్జల శ్రీధర్ రెడ్డి, మాండ్ర శివానంద తదితరులు ఉన్నారు. ఎమ్మెల్యేల మద్దతుతో ఎవరికి వారే విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. అంతేగాక బీసీ సామాజిక వర్గానికి టిక్కెట్ ఇవ్వాలని కేఈ వర్గం కోరుతోంది. గతంలో నంద్యాల డివిజన్ వారికి అవకాశమిచ్చారని, ఈసారి కర్నూలు డివిజన్ వారికి అవకాశమివ్వాలని, అయితే శిల్పా సోదరులు ప్రధానంగా 2019 అసెంబ్లీ ఎన్నికల టిక్కెట్ పైన గురి పెట్టారని తెలుస్తోంది. దీంతో గత ఎన్నికల్లో పోటీ చేసిన గౌరు వెంకట రెడ్డిని మరోసారి నిలబెట్టవచ్చునని అంటున్నారు.
నాడు టిడిపి నుంచి పోటీ చేసిన శిల్పా చక్రపాణిపై వైసీపీ అభ్యర్థిగా గౌరు 62 ఓట్ల స్వల్ప మెజార్టీతో ఓడారు. ఇప్పుడు గౌరును నిలబెడితే శిల్పా మద్దతుతో వైసీపీ గెలుస్తుందని అంటున్నారు. కనుక అన్నదమ్ములు కలసి నంద్యాల కు బదులుగా కర్నూల్ గెలుపుతో ప్రతికారం తీర్చకునే అలోచనలో ఉన్నారు. వైఎస్ జగన్ బలం చూసి గట్టి పోటి ఇవ్వడానికి టీడీపీ నాయకులు..చంద్రబాబు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. మరో పక్క ఖచ్చితంగా వైసీపీ విజయం అంటున్నారు…అప్పుడే 62 ఓట్ల స్వల్ప మెజార్టీతో ఓడారు..మరి గెలిచిన వారు ప్రస్తుతం వైసీపీలో చేరారు కనుక గెలుపు ఖాయం అంటున్నారు వైసీపీ నాయకులు.