సాధారణ ప్రసవాలతో తల్లుల ఆరోగ్యాన్ని కాపాడాలన్న గొప్ప సంకల్పంతో ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టింది. తెలంగాణ ఉద్యమంలో క్షేత్రస్థాయిలో సామాన్యుల జీవితాలను దగ్గరి నుంచి చూసి న నేత తెలంగాణకు పాలకుడు కావడం మూలంగానే ఇలాంటి పథకాలు ప్రజలకు అందుబాటులోకి వస్తున్నాయన్నది అందరూ ఒప్పుకోవాల్సిన నిజం.
భాస్కర్. పెళ్లిళ్లకు, సభలకు డెకరేషన్ చేయడం వృత్తి. రెక్కాడితే గాని డొక్కాడని బతుకు. భార్య గర్భవ తి. ఆమెకు గుండె జబ్బు ఉండటంతో డాక్టర్ పర్యవేక్షణ తప్పనిసరి. పరిస్థితి చెప్పుకొని సలహా అడిగాడు. ఎందుకైనా మంచిది కాన్పు అయ్యేవరకు హైదరాబాద్ లో ఉంచు అని చెప్పా. గుండెజబ్బు ఉండటంతో కాన్పు కష్టం అని డాక్టర్లు చెప్పారు. అబార్షన్ చేయించుకున్నా అదే పరిస్థితి. భార్యభర్తలు ఇద్దరూ మాట్లాడుకొని కష్టమో నష్టమో బిడ్డను కనడానికే సిద్ధ మయ్యారు. బంజారాహిల్స్‌లోని ఓ కార్పొరేట్ దవాఖానలో లక్షా పదివేలకు మాట్లాడుకున్నారు.
కష్టమైనా కన్నబిడ్డ మీద మమకారంతో ఆ లక్షను అప్పోసప్పో చేసి సమకూర్చుకున్నాడు. 2014 జూలై 11న పండంటి ఆడబిడ్డ పుట్టింది. బిడ్డ పుట్టిన వెంట నే బరువు తక్కువగా ఉందని పక్కనే ఉన్న మరో చిన్నపిల్లల కార్పొరేట్ దవాఖానకు రిఫర్ చేశారు. నాలుగు రోజులకు లక్షా నలభై వేల బిల్లు చేతిలో పెట్టారు. అప్పటికే కాన్పుకు లక్ష పదివేలు అయింది. ఇక పాప కు 60 వేలు కడితే 35 వేలు మందుల బిల్లు కింద పట్టుకొని మిగిలిన 25 వేలు బిల్లుకింద జమకట్టారు. అయినా లక్షా 15 వేలు కట్టాలి. పాపను ఎప్పుడు డిశ్చార్జ్ చేస్తారు? అసలేం వైద్యం జరుగుతుంది తెలియదు. లక్షా 40 వేల బిల్లు మాట విని అన్నా ఇది పరిస్థితి అని కాల్ చేశాడు.
ప్రముఖ పత్రికలో ఆరోగ్య కాలమ్స్ రాసే ఓ జర్నలిస్ట్ మిత్రుడిని సంప్రదిస్తే ఓ డాక్టర్ నంబర్ ఇచ్చాడు. కాల్ చేస్తే ఆ దవాఖాన నుంచి ఆ పాపను డిశ్చార్జ్ చేసుకొచ్చి నిలోఫర్‌లో జాయిన్ చేయించు మిగతా బాధ్యత నాది అన్నారు. బంజారాహిల్స్‌లో ఉన్న ఆ దవాఖానకు వెళ్లి భాస్కర్‌కు పరిస్థితి వివరించాను. ఆ అబ్బాయి భార్య కాన్పు ఖర్చులే భరించలేని పరిస్థితి. ఈ బిల్లు ఎలా కట్టగలడు? అప్పటికీ తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నెల పది రోజులు. ప్రభుత్వంలో ముఖ్యులు జోక్యం చేసుకుంటే తప్ప ఈ సమస్యకు పరిష్కారం లేదు. ఓ నేతను ఈ విషయమై సంప్రదిస్తే ఆ కార్పొరేట్ దవాఖానలు మన మాట వింటాయా.. కష్టమైనా భరించి ఆ పాప బిల్లు అంతా కట్టి తీసుకురా.. ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి సాయం చేయించే బాధ్యత నాది అని మాటిచ్చారు.
వెంటనే ముఖ్యమంత్రి గారి రాజకీయ కార్యదర్శి శేరి సుభాష్‌రెడ్డి గారి దృష్టికి సమస్యను తీసుకెళ్లాం. దవాఖాన దగ్గరే ఉండండని చెప్పారు. సరిగ్గా గంట తర్వాత అప్పటి ఉప ముఖ్యమంత్రి రాజయ్య గారి దగ్గరి నుంచి ఫోన్ వచ్చింది. వెంటనే పాప దగ్గరికి తీసుకెళ్లి ఓ ఫొటో దింపి ఆ పాప తల్లిదండ్రులను ఒక సంస్థ వద్దకు తీసుకెళ్లి రూ.2.5 లక్షలు మంజూరయ్యాయి. పాపను ఇంకో 15 రోజులు దవాఖానలో నే ఉంచుకొని క్షేమంగా ఇంటికి పంపారు. ఆ పాప పేరు కారుణ్యశ్రీ. మొన్న జూలైకి మూడేండ్లు నిం డాయి.
ఇప్పటివరకు కాన్పు అంటే మామూలు జనాలకు గుండెల మీద బరువే. గత ప్రభుత్వాల నిర్వాకం మూలంగా ప్రభుత్వ దవాఖానల మీద భయం. ప్రైవేట్ దవాఖానల మీద అనుమానం పెరిగాయి. సగటు జీవి ప్రభుత్వ దవాఖానకు ధైర్యంగా వెళ్లలేడు. ప్రైవేట్ దవాఖానలో ఖర్చు భరించలేడు. సగటుజీవి దవాఖానకు వెళ్లాలంటేనే గుండె గుబేల్‌మనే పరిస్థితి. కానీ ఈ మూడేండ్లలో తెలంగాణ ప్రభు త్వం ఈ పరిస్థితికి చరమగీతం పాడింది. ప్రాజెక్టులు, మిషన్ కాకతీయతో సాగునీరు, మిషన్ భగీరథతో తాగునీరు, డబుల్ బెడ్‌రూమ్‌లతో ఇండ్ల నిర్మాణం, సాంఘిక సంక్షేమ పాఠశాలలతో విద్య, దవాఖానలలో వసతుల కల్పన, అమ్మఒడి, కేసీఆర్ కిట్‌తో ఆరోగ్య సదుపాయాలను సామాన్యులకు అందుబాటులోకి తెచ్చింది. మనిషి కనీస అవసరాలు కూడు, గూడు, విద్య, వైద్యం. గత అరువై ఏండ్ల ప్రభుత్వాల నిర్లక్ష్యాన్ని మూడేండ్ల పాలనతో ముఖ్యమంత్రి కేసీఆ ర్ పారదోలేందుకు కంకణం కట్టుకున్నారు.
కాన్పు అంటేనే గుబులుపడే సామాన్యులకు అమ్మఒడి పథకం, కేసీఆర్ కిట్‌తో తెలంగాణ ప్రభుత్వం అండగా నిలబడుతున్నది. పథకం అంటే ఒక ప్రహసనంగా కాకుండా ఓ ప్రణాళికతో ప్రభుత్వం ముందుకు వెళ్తుండటంతో తక్కువ సమయంలోనే లక్ష మందికి పైగా కేసీఆర్ కిట్లు అందాయి. గత జూన్ ముందువరకు వెలవెలబోయిన ప్రభుత్వ దవాఖాన లు ఇప్పుడు కిటకిటలాడుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కొత్తగా ఉద్యోగాల భర్తీకి కూడా సిద్ధమైం ది. ఇప్పుడు కేసీఆర్ కిట్‌లో తెలంగాణవ్యాప్తంగా 5 లక్షల 66 వేల 799 మంది నమోదు చేయించుకోగా .. కాన్పులైన లక్షా 28 వేల 462 మంది కేసీఆర్ కిట్లు అందుకోవడం గమనార్హం.
ఇన్నాళ్లు ప్రాథమిక ఆరోగ్యకేంద్రాలను, ఏరియా దవాఖానలను గాలికి వదిలేశారు. కానీ ఇప్పుడు ప్రభుత్వం వాటిని సమూలంగా మార్చి క్షేత్రస్థాయి లో రోగులకు సౌకర్యాలు కల్పిస్తున్నది. కిడ్నీ డయాలసిస్ అంటే పేదలు నిమ్స్ దవాఖాన ముందు క్యూ కట్టి తమ సమయం కోసం ఎదురుచూసేవారు. ఇప్పుడు అన్ని నియోజకవర్గ, జిల్లాస్థాయి ఆసుపత్రులలో డయాలసిస్ కేంద్రాలు ఏర్పాటుచేసి సామాన్యుల గుండె బరువు దించింది. ఇప్పుడు మొత్తం తెలంగాణవ్యాప్తంగా వంద పడకలతో ఇంకో 27 దవాఖానల నిర్మాణానికి ప్రణాళిక చేసింది. ఇవికాకుండా అదనంగా 15 వైద్యశాలల నిర్మాణానికి 150 కోట్లతో అంచనాలు రూపొందించారు. హైదరాబాద్ గాంధీ దవాఖానలో అదనంగా 300 పడకలు ప్రసవాల కోసం సిద్ధం చేస్తున్నది.
సరిగ్గా మూడేండ్ల క్రితం కాన్పు కోసం అప్పులపాలైన ఓ యువకుడిని చూసిన చోటే.. ఈ రోజు తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల మూలంగా పేదలు దవాఖానల ముందు ధైర్యంగా నిలబడుతున్నారు. సాధారణ ప్రసవాలతో తల్లుల ఆరోగ్యాన్ని కాపాడాలన్న గొప్ప సంకల్పంతో ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టింది. తెలంగాణ ఉద్యమంలో క్షేత్రస్థాయిలో సామాన్యుల జీవితాలను దగ్గరి నుంచి చూసి న నేత తెలంగాణకు పాలకుడు కావడం మూలంగానే ఇలాంటి పథకాలు ప్రజలకు అందుబాటులోకి వస్తున్నాయన్నది అందరూ ఒప్పుకోవాల్సిన నిజం.
By : ” సందీప్ రెడ్డి కొత్తపల్లి “