జమ్మూ కశ్మీర్ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ సయిద్ తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలో పర్యటించనున్నారు ..ఈ నేపధ్యంలో ఈ నెల 28న జమ్ము కశ్మీర్ టూరిజం ప్రమోషన్లో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ తో ఆమె భేటీ కానున్నారు. ప్రగతి భవన్లో ముఖ్యమంత్రి కేసీ ఆర్ తో కలిసి మెహబూబా ముప్తీ లంచ్ చేసే అవకాశముంది.ఈ క్రమంలో ఐటీసీ షెర్టన్ గ్రాండ్ కాకతీయలో జమ్ము సీఎం రాత్రి బస చేయనున్నారు.తిరిగి 29న హైదరాబాద్ నుంచి కశ్మీర్కు ముప్తీ తిరుగు ప్రయాణం కానున్నారు
