శీతాకాల విడిది నిమిత్తం రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆదివారం హైదరాబాద్ చేరుకున్నారు. హకీంపేట విమానాశ్రయంలో గవర్నర్ నరసింహన్ , సీఎం కేసీఆర్, జీహెచ్‌ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్ ఆయనకు పుష్పగుచ్ఛం ఇచ్చి ఘనస్వాగతం పలికారు. అనంతరం రాపతి బొల్లారంలోని రాష్ట్రపతి నిలయానికి బయలుదేరి వెళ్లారు. ఈరోజు రాత్రి గవర్నర్ నరసింహన్ రాజ్‌భవన్‌లో ఏర్పాటుచేసిన విందుకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్,సీఎం కేసీఆర్ హాజరుకానున్నారు.