వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజాసంకల్ప యాత్ర పేరిట రాష్ట్రంలో అనంతపురం జిల్లాలో చేస్తున్న పాదయాత్రకు కదిరి అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలో ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు.ఈ క్రమంలో జిల్లాలో ధర్మవరం, పుట్టపర్తి నియోజకవర్గాల మీదుగా జగన్ కదిరి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోకి ఎంటర్ అయ్యారు. నేటితో జగన్ పాదయాత్ర 42వ రోజుకు చేరుకుంది.ఇక్కడ నుంచి గత ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున అత్తార్ చాంద్ బాషా విజయం సాధించారు. అయితే ఆయన తెలుగుదేశం పార్టీలోకి ఫిరాయించారు. తెలుగుదేశం నేతగా కొనసాగుతున్నారు.
ఈ నేపథ్యంలో ఈ నియోజకవర్గం పరిధిలో జగన్ పాదయాత్ర ఆసక్తిదాయకంగా మారింది. చాంద్ బాషా వైకాపాను వీడి వెళ్లి వెళ్లిన అనంతరం ఇక్కడ పీవీ సిద్ధారెడ్డి వైకాపా ఇన్ చార్జిగా ఉన్నారు.ఇక్కడ జగన్ నిర్వహిస్తున్న బహిరంగ సభకు ప్రజలు ఇసుక వేస్తే రాలేనంతగా వచ్చి బ్రహ్మరథం పడుతున్నారు .