ఏపీ అధికార పార్టీ టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు ,ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గత సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ తరపున గెలిచిన ఇరవై మూడు ఎమ్మెల్యేలను ,ముగ్గురు ఎంపీలను ,ఒక ఎమ్మెల్సీను పసుపు కండువా కప్పి టీడీపీలో చేర్చుకున్న సంగతి తెల్సిందే .మరో ఏడాదిన్నర సమయంలో సార్వత్రిక ఎన్నికలు రానున్న నేపథ్యంలో చంద్రబాబు వైసీపీ తరపున గెలిచి టీడీపీలో చేరిన ఇరవై మూడు ఎమ్మెల్యేల పనితీరుపై సర్వే చేయించారు అని టీడీపీ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి .
ఇదే విషయం గురించి ఏపీ బాబు ఆస్థాన మీడియా కథనాలను కూడా ప్రసారం చేసింది .ఈ నేపథ్యంలో వైసీపీ తరపున గెలిచి టీడీపీలో చేరి మంత్రులుగా బాధ్యతలు నిర్వహిస్తున్న భూమా అఖిల ప్రియ ,ఆదినారాయణ రెడ్డి ,సుజయ్ రంగా కృష్ణారావు ,అమర్ నాథ రెడ్డిలతో సహా మొత్తం ఇరవై మూడు ఎమ్మెల్యేలు ,ముగ్గురు ఎంపీల పనితీరుపై బాబు తన సొంత ఏజెన్సీతో సర్వే చేయించాడు .ఇందులో ప్రధానంగా ప్రభుత్వం చేపడుతున్న పలు సంక్షేమ అభివృద్ధి పథకాలతో పాటుగా ఎమ్మెల్యేలపై ప్రజలలో స్పందనపై సర్వే చేయించారు .మొత్తంగా ఎమ్మెల్యేలపై స్థానిక ఓటర్లలో తీవ్ర వ్యతిరేకత ఉంది .
అంతే కాకుండా అధికారాన్ని అడ్డుపెట్టుకొని స్థానిక టీడీపీ నేతల దగ్గర నుండి వైసీపీ ఫిరాయింపు ఎమ్మెల్యేల వరకు చేస్తున్న పలు అక్రమాలు ,అవినీతిపై ఓటర్లు మండిపడుతున్నారు .గత సార్వత్రిక ఎన్నికల్లో ఇచ్చిన ఆరు వందల ఎన్నికల హామీల్లో ఏ ఒక్క హమీను నేరవేర్చకపోవడం ..వైసీపీ పార్టీ అధినేత జగన్ ను చూసి ఓట్లు వేసి గెలిపిస్తే టీడీపీలో చేరడం ఇలా పలు అంశాలు ఇక్కడి ఎమ్మెల్యేలతో పాటుగా అధికార పార్టీకి తీవ్ర వ్యతిరేకంగా ఫలితాలు రానున్నాయి అని తేలింది .ఒక్కముక్కలో చెప్పాలంటే ప్రస్తుతం ఉన్న ఇరవై మూడు ఎమ్మెల్యేలలో అందర్నీ మార్చి వేరేవాళ్ళను నిలబెట్టిన డిపాజిట్లు కూడా దక్కవు అని బాబు సొంతగా నిర్వహించిన సర్వేలో తేలడంతో అవాక్కవడం బాబు వంతైంది అని పార్టీ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి .అసలే ఫిరాయింపు ఎమ్మెల్యేలు ,మరోవైపు అవినీతి అక్రమాలు ఇలా తమకు రానున్న ఎన్నికల్లో ఇరవై మూడు చోట్ల ఓటర్లు ఓడగోట్టడానికి సిద్దంగా ఉన్నారని తేలడంతో ఏమి చేయాలో నలబై యేండ్ల రాజకీయ అనుభవం ఉన్న బాబుకు అర్ధం కాక అనవసరంగా చేర్చుకొని తప్పు చేశామా అని సన్నిహితుల వద్ద వాపోతున్నారు అంట .