ఏపీలో కర్నూలు జిల్లా రాజకీయాలు సార్వత్రిక ఎన్నికలకు ఇంకో ఏడాది సమయం ఉండగానే అప్పుడే హీటేక్కాయి.ఇటివల టీడీపీ పార్టీకి గుడ్ బై చెప్పి ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీలో చేరిన మాజీ మంత్రి శిల్పా మోహన్ రెడ్డి ,మూడు నెలల ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన శిల్పా బ్రదర్ శిల్పా చక్రపాణి రెడ్డి రానున్న సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ గెలుపుకు పక్క ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు .ఇటివల జరిగిన నంద్యాల అసెంబ్లీ నియోజక వర్గ ఉప ఎన్నికల్లో ఓటమి అనంతరం మరల శిల్పా బ్రదర్స్ రంగంలోకి దిగారు .ఈ ఉప ఎన్నికల్లో టీడీపీ దాదాపు రెండు వందల కోట్ల రూపాయలను ఖర్చు చేసిందని రాష్ట్ర రాజకీయాల్లో టాక్ .
అయితే మరో ఏడాదిన్నర సమయం ఉండటంతో సార్వత్రికఎన్నికల్లోజిల్లాలో ఉన్న మొత్తం పద్నాలుగు అసెంబ్లీ స్థానాల్లో వైసీపీ జెండా ఎగురవేయడానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు .అందులో భాగంగా నియోజక వర్గాల్లో ఉన్న నిరుద్యోగ యువత ,మహిళలు ,వృద్ధులు లను ఆకర్శించుకోవడానికి పక్క ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు .గత సార్వత్రిక ఎన్నికల్లో యువత ,మహిళలను ఆదుకోవడానికి బాబు కురిపించిన హామీలు ఇంటికో ఉద్యోగం ,మహిళలకు డ్వాక్రా రుణాలు మాఫీ లాంటి హామీల పై బాబు నేతృత్వంలోని టీడీపీ సర్కారు అవలంబిస్తున్న తీరును ఎండగడుతూనే మరోవైపు జగన్ కురిపించిన నవరత్నాలను ఎలా అమలు చేస్తారు ..వాటికి అయ్యే బడ్జెట్ ఎంత ..ప్రస్తుత పరిస్థితుల్లో జగన్ ఇచ్చిన హామీలను ఎలా నేరవేర్చబోతుంది ..
ముఖ్యంగా రైతులు ,మహిళలు ,యువతకోసం వైసీపీ అధికారంలోకి వస్తే చేసే పలు అభివృద్ధి పథకాలు ఇలా ఇంటిఇంట ప్రచారం చేస్తూ స్థానిక ఓటర్లో చైతన్యం తీసుకురావాలని శిల్పా బ్రదర్స్ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు .అందులో భాగంగా జిల్లాలో ఉన్న మొత్తం పద్నాలుగు నియోజక వర్గాల్లో వైసీపీ శ్రేణులతో పాటుగా స్థానిక మహిళలు ,యువత,రైతన్నలను భాగస్వామ్యం చేస్తూ కమిటీలు వేయడానికి చర్యలు తీసుకోనున్నారు .ఈ కమిటీల ద్వారా క్షేత్ర స్థాయిలో ఆయా నియోజక వర్గాల ఇంచార్జ్ ,నేతలతో కల్సి ప్రభుత్వ అవినీతి అక్రమాలపై పోరాడుతూనే వైసీపీ పార్టీని బలోపేతం చేయడానికి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో రానున్న ఎన్నికల్లో పద్నాలుగు సీట్లలో పద్నాలుగు సీట్లు గెలవడానికి పక్క వుహ్యాలు ,ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు అని బాబుకు టీడీపీ వర్గాల ద్వారా తెలియడంతో నిద్ర కరువైంది అని రాజకీయ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి ..