గ్రామస్థాయి నుంచి.. దేశరాజధాని వరకు మహిళల రక్షణ కోసం ఎన్ని చట్టాలు, చర్యలు తీసుకున్నా అవేవీ ఫలితాలన్ని ఇవ్వడం లేదు. అంతేగాక, ప్రభుత్వాలు తీసుకొచ్చిన చట్టాలు తమను ఏమీ చేయలేవన్నట్టుగా కామాంధులు విర్రవీగుతున్నారు. మహిళలపై దాడులకు తెగబడుతున్నారు.
అయితే, తాజాగా ఇటువంటి సంఘటనే కోల్‌కతాలో చోటు చేసుకుంది. కాగా, అనన్య ఛటర్జీ అనే యువతి ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తోంది. రోజూలాగే తన విధులు నిర్వహించేందుకు ఇంటి నుంచి బస్సులో బయల్దేరింది అనన్చ ఛటర్జీ. అదే సమయంలో ఖాళీగా ఉన్న తన వెనుక సీటులో ఓ యువకుడు కూర్చొని.. అదే పనిగా పెద్ద సౌండ్స్‌తో నీలి చిత్రాలు చూడటం మొదలు పెట్టాడు. అంతటితో ఆగక ఆ నీలి చిత్రాలను అనన్యకు చూపించడం మొదలు పెట్టాడు. దీంతో విసుగు చెందిన అనన్య ఒక్కసారిగా ఆగ్రహంతో ఊగిపోయింది.
ఆ కామాంధుడి జుట్టుపట్టుకుని లైకి లేపి అతని ప్రైవేట్ ప్రదేశంలో ఓ కిక్ ఇచ్చింది. చెడామడా కొడుతూ.. తిడుతూ.. తన బాధను వ్యక్తం చేసింది అనన్య. దీంతో డ్రైవర్ బస్సును పోలీస్ స్టేషన్ వైపు మళ్లించాడు. ఆ కామాంధుడ్ని పోలీసులకు అప్పగించారు. అనన్య చేసిన ఈ పనికి పలువురి నుంచి ప్రశంసలు లభించాయి.