తిరుపతి నుంచి నిజామాబాద్ వెళ్ళుతున్న రాయలసీమ ఎక్స్‌ప్రెస్ శనివారం ఉదయం ఇందల్వాయ్ మండలం సిర్నాపల్లి వద్ద పట్టాలు తప్పింది. అయితే డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పింది. ప్రయాణికులు అందరూ క్షేమంగా ఉన్నారుఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు, సిబ్బంది ట్రాక్‌పైకి రైలును ఎక్కించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ మార్గంలో ప్రయాణించే కాచీగూడ- నిజామాబాద్ ప్యాసింజర్ రైళ్లు, కాచిగూడ – నార్కేర్ ఇంటర్సిటి ఎక్స్‌ప్రెస్ రైలు, 11 గంటలకు నిజామాబాద్ నుంచి బయలుదేరే దేవగిరి ఎక్స్‌ప్రెస్ కాస్తా ఆలస్యంగా నడుస్తాయని అధికారులు తెలిపారు.