ఏపీలో విశాఖపట్నంలోని పెందుర్తి మండలంలో ఇటీవల ఓ ఎస్సీ మహిళ పై టీడీపీ కార్యకర్తలుగా భావిస్తున్న కొందరు అనుచితంగా ప్రవర్తించిన ఘటనపై నటుడు, జనసేన పార్టీ అధినేత పవన్‌కల్యాణ్ స్పందించారు. ఈ ఘటనపై ప్రభుత్వం వెంటనే విచారణ జరపాలని డిమాండ్ చేస్తూ వరుస ట్వీట్లు చేశారు. ఈ సందర్భంగా గతంలో దళితుల పై జరిగిన కారంచేడు, చుండూరు ఘటనలను పవన్ గుర్తుచేశారు.
నేను నేరుగా ఈ విషయంలో జోక్యం చేసుకుంటే అధికారుల పై మరింత ఒత్తిడి పెరుగుతోందని… అందుకే అలా జరగకుండా బాధిత మహిళకు న్యాయం జరిగేలా చూడండి.., అంటూ పవన్ కళ్యాణ్ హెచ్చరించారు.అయితే దళిత మహిళ పై జరిగిన ఘటన పై పవన్ ఇంత ఆలస్యంగా స్పందించడంతో సోషల్ మీడియాలో ఆయన పై మండిపడుతున్నారు.
ఒకవైపు జగన్ పాదయాత్ర చేస్తున్నా.. ఆ ఘటన పై వెంటనే స్పందిచారు. ఎమ్మెల్యే రోజాతో సహా చాలా మంది వైసీపీ నేతలు స్పందిచారు. అయితే ప్రశ్నిచడానికే వచ్చానని చెప్పే జనసేనానికి మాత్రం టైమ్ లేకపోయింది.. దొంగలు పడ్డ ఆర్నెల్లకు కుక్కులు మొరిగి నట్టు.. పవన్ ఇప్పుడు ట్విట్టర్‌కు ఎక్కి అధికారులకు సినిమా స్టైల్‌లో వార్నింగులు ఇవ్వడంతో పీకే మహిళా అభిమానులు కూడా మండి పడుతున్నారు. పవన్‌కు అభిమానులుగా ఉండడం కంటే కామ్‌గా ఉండడం బెటర్ అని.. అయినా ఇంట్లో పెళ్ళాలకే న్యాయం చేయనోడు.. రాష్ట్రంలో మహిళలకు ఎలా చేస్తాడని.. ఇకనైనా పీకే ఫ్యాన్స్ అందురూ కళ్ళు తెరవాలని సోషల్ మీడియాలో ఫైర్ అవుతున్నారు. దీంతో ఈ మ్యాటర్ ఇప్పుడు వైరల్ అవుతోంది.