పెందుర్తి ఘటన జరిగి మూడు రోజులు అయిన తర్వాత ఇప్పుడు ఎసి లొ కూర్చుని నామ మాత్రానికి ట్విట్టర్ లొ మెసెజ్ చెస్తున్నారు అంటూ వైసీపీ మహిళ నాయకురాలు మండి పడుతున్నారు. టిడిపి ప్రభుత్వం అంటె మీకు ఎందుకయ్య ఇంత భయ్యం ఎందుకయ్య అని ప్రశ్నిస్తున్నారు. విశాఖలో దళిత మహిళపై జరిగిన దాడి గురించి జనసేన అధినేత, నటుడు పవన్ కల్యాణ్ స్పందిస్తూ శనివారం ఉదయం నుంచి వరుసగా ట్వీట్లు చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ ఘటనపై టీడీపీ, బీజేపీ, వైసీపీలు అసెంబ్లీలో చర్చించి, ఇలాంటివి పునరావృతం కాకుండా చూడాలని సూచించారు. బాధితురాలికి అండగా నిలవాలని కోరుతూ అమెరికా, యూరప్ నుంచి చాలా మంది మహిళలు తనకు మెసేజ్‌లు పంపుతున్నారంటూ పవన్ ట్వీట్ చేశారు. పవన్ ట్వీట్లపై చిత్తూరు జిల్లా నగరి వైసీపీ ఎమ్మెల్యే ఆర్కె రోజా తనదైన శైలిలో పవన్ ను విమర్శించారు. ఎవరో యూరప్‌లో ఉన్న ఓ మహిళ మెసేజ్ చేసి, బాధితురాలికి సాయం చేయమని అడిగే వరకు ఒక ఆడపడుచుకు అవమానం జరిగిందన్న సంగతి నీకు తెలియక పోవడం సిగ్గు చేటని ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశారు.
]దళిత మహిళపై దాడి జరిగిన వెంటనే వైసీపీ స్పందించిందని, నిందితులు అరెస్ట్ అయిన తర్వాత క్రెడిట్ వైసీపీకి వస్తుందనే భయంతోనే, ఈ రోజు కొందరు టీడీపీ ప్రభుత్వాన్ని నొప్పించకుండా ట్వీట్లు చేశారని ఆమె ఎద్దేవా చేశారు.దళిత మహిళపై పైశాచికం చేసిన నిందితులకు శిక్షపడేలా పోరాటం సంఘటన జరిగిన మరుసటి రోజే అన్ని జిల్లాల్లో వైసీపీ మహిళా నాయకుల పోరాటం చేశారన్నారు. అలాగే తమ అధినేత వైయస్ జగన్ కూడా పాదయాత్రలో ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసి, బాధితురాలికి న్యాయం చేసి నిందితులను శిక్షించాలని కోరారని రోజా పేర్కొన్నారు.