ప్రపంచ తెలుగు మహాసభలను తెలంగాణ ప్రభుత్వం ఘనంగా నిర్వహించిన సంగతి తెలిసిందే. మహాసభల విజయవంతం అయ్యాయంటూ అన్నివర్గాలు వేనోళ్ల పొగుడుతున్నాయి. అయితే కొందరు నిత్య విమర్శకారులు తమదైన శైలిలో అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మహసభల నిర్వహణ బాధ్యతలు విజయవంతంగా నిర్వహించిన తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ నందిని సిద్ధారెడ్డి కీలక కామెంట్లు చేశారు.
అభివృద్ధిని, సాహితీ వైభవాన్ని చూడలేని వ్యక్తులు విమర్శలు చేస్తున్నారని ఓ మీడియా చానల్‌తో మాట్లాడుతూ నందిని సిధారెడ్డి మండిపడ్డారు. ఏపీ సీఎం చంద్రబాబును ఆహ్వానించాలని నిర్ణయించామని అయితే ఆయనకు తేదీలు కుదరకపోవడంతో మహాసభల తేదీలు మార్చే పరిస్థితి లేదు కాబట్టి ముందుకు వెళ్లామన్నారు. చంద్రబాబు ఒక్కడే ఆ ప్రాంతానికి ప్రతినిధి కాదన్న సిద్ధారెడ్డి రాజకీయ నేతల కంటే సాహిత్యపరమైన వ్యక్తులే తాము ఎక్కువగా భావించామని స్పష్టం చేశారు.
తెలుగు మహాసభలపై జేఏసీ చైర్మన్ కోదండరాం అసత్యాలు మానుకోవాలన్నారు. కోదండరాంకు తెలుగు సభలను వినేంత విశాల హృదయం లేదని సిద్ధారెడ్డి అన్నారు. తెలుగు మహాసభల ద్వారా మూడు లక్ష్యాలను సంపూర్ణoగా సాధించామన్నారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌ను సినిమా వాళ్లే ప్రశంసించారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి పథంలో ముందుకు సాగుతున్నా…ఇతరులు ప్రశంసిస్తున్నా జీర్ణించుకోలేరా అని ప్రశ్నించారు.