పౌరసేవలను నేరుగా ప్రజలకే అందుబాటులోకి తేవడం, సాంకేతిక విప్లవాన్ని ఇంటింటికీ చేరువ చేసేందుకు ఉద్దేశించిన తెలంగాణ ఫైబర్ గ్రిడ్‌ను రాష్ట్ర ప్రభుత్వం శరవేగంగా ముందుకు తీసుకుపోతున్నది. మిషన్ భగీరథతో సహా కార్యక్రమాలు చేపట్టడం వల్ల పనులు వేగంగా పూర్తవడంతో త్వరలోనే పైలెట్ ప్రాజెక్టు గ్రామాల్లో సేవలను ప్రారంభించనున్నారు. పైలెట్ ప్రాజెక్ట్ దశలోనే అంతర్జాతీయ దిగ్గజాలు పాలు పంచుకునేందుకు వేదికగా మారింది. కేంద్ర ప్రభుత్వంచే ప్రశంసలు పొందుతున్నది. సామాన్యుడు సాంకేతిక విప్లవ ఫలాలను అందించాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి కేసీఆర్ మార్గదర్శకం మేంరకు రాష్ట్ర ఐటీ శాఖా మంత్రి కేటీఆర్ టీ ఫైబర్ గ్రిడ్‌కు శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ ప్రాజెక్టుతో కలిసి ఐటీ శాఖ టీ ఫైబర్ గ్రిడ్‌ను ముందుకుతీసుకుపోతోంది. ఇంటింటికీ ఇంటర్నెట్ అందించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ క్రమంలో శరవేగంగా డక్ట్‌ల నిర్మాణం, ఆప్టిక్ ఫైబర్ వేస్తున్నది. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా 27,000 కిలోమీటర్ల మేర ప్రధాన ఆప్టిక్ ఫైబర్ వేశారు. డిసెంబర్ 2018 నాటికి పూర్తి స్థాయిలో ఆప్టిక్ ఫైబర్ వేయాలని నిర్ణయించుకున్నారు. ఇంటింటి వరకు ఫైబర్ వేసే వరకు ఇది లోఆ 20వేల వరకు చేరనుంది. ప్రాజెక్టు మొత్తం ఖర్చు రూ.5500 కోట్లు కాగా, మిషన్ భగీరథతో సమన్వయం చేసుకోవడం వల్ల డక్ట్‌ల తవ్వకంలో రూ. 1500 కోట్లు ఆదా అయ్యాయి. భారత్‌నెట్ కింద కేంద్ర ప్రభుత్వం రూ.1,242 కోట్లు అందంచనుంది. మిగతా మొత్తాన్ని రుణం రూపంలో రాష్ట్రం ప్రభుత్వం పొందనుంది.