తెలంగాణ రాష్ట్ర పొలిటికల్ జేఏసీ ఛైర్మన్ ప్రో.కోదండరాం అమరుల స్పూర్తి యాత్ర చేస్తున్న సంగతి తెల్సిందే .అందులో భాగంగా ఆయన ప్రస్తుతం నల్గొండ జిల్లాలో పర్యటిస్తున్నారు .ఈ క్రమంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రజాస్వామిక తెలంగాణ సాధనకోసం పోరాడుతున్నాము అని ఆయన తెలిపారు .అధికారంలోకి వచ్చి బాధ్యతలు మరిచిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మీద పోరాడాలి .రైతులను ఆదుకోవడంలో సర్కారు విఫలమైంది .రైతన్నల ఆత్మహత్యలకు కారణం టీఆర్ఎస్ సర్కారు .గ్రామాస్థాయిలో పర్యటించి రైతుల సమస్యల పరిష్కారం ప్రణాళికలు సిద్ధం చేస్తాము అని ఆయన తెలిపారు .
