Home / SLIDER / దేశంలోనే రికార్డ్ సృష్టించిన ” కళ్యాణలక్ష్మి”

దేశంలోనే రికార్డ్ సృష్టించిన ” కళ్యాణలక్ష్మి”

ఆడపిల్ల పెళ్లి చేయాలంటే ఎంతో ప్రయాస. చాలా ఖర్చుతో కూడుకున్న కార్యం. నిరుపేదలయితే అప్పులు చేసి వివాహాలు జరిపిస్తుంటారు. ఇలాంటి వారి కోసం తెలంగాణ రాష్ట్రంలో తొలిసారిగా అధికారంలోకి వచ్చాకా ప్రభుత్వం ప్రవేశపెట్టిన కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలు వారి ఇళ్లల్లో వెలుగులు నింపుతున్నాయి. ఇంటికి పెద్దదిక్కుగా, ఆడబిడ్డకు అన్నగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఇస్తున్న ఆర్థికసాయం కొండంత అండ అవుతోంది. గతంలో ఎస్సీ, ఎస్టీలు, మైనార్టీలకే వర్తించిన ఈ పథకాన్ని ప్రస్తుతం ఆహారభద్రత కార్డులు కలిగిన పేదలందరికీ వర్తింపచేస్తూ ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అంతేకాదు గతంలో రూ.51 వేలు అందజేయగా.. పెరిగిన ఖర్చులతో సాయం చాలదని రూ.75,116లకు
పెంచారు. ఈ క్రమంలో ఈ పథకాన్ని ప్రభుత్వం ప్రారంభించినప్పటి నుంచి నిన్నటివరకు ( శుక్రవారం) వరకు ఈ పథకం కింద లబ్ధిపొందిన వారి సంఖ్య మూడు లక్షలు దాటి దేశంలోనే రికార్డ్ సృష్టించింది .

లబ్ధిదారులకు ప్రభుత్వం ఇప్పటి వరకు రూ. 1,785.89 కోట్లు విడుదల చేసింది. తెలంగాణ ఆవిర్భవించి టీఆర్‌ఎస్ అధికార పగ్గాలు చేపట్టినప్పటి నుంచి సంక్షేమ రంగానికి పెద్దపీట వేస్తున్నది. సంక్షేమ పథకాలకు మొత్తం బడ్జెట్‌లో దాదాపు 30 శాతం నిధులను కేటాయిస్తున్నది. ఈ పథకం సంక్షేమరంగంలో సరికొత్త ఒరవడికి తెరతీసింది. దేశవ్యాప్తంగా అన్నిరాష్ర్టాల దృష్టిని ఆకర్షించింది. కేంద్ర ప్రభుత్వం సైతం దీనిని మార్గదర్శకంగా తీసుకున్నది. పట్టణ ప్రాంతాలలో రెండున్నర లక్షల రూపాయలలోపు, గ్రామీణప్రాంతాలలో లక్షన్నరలోపు వార్షికాదాయం ఉన్న కుటుంబాలకు ఈ పథకం వర్తిస్తున్నది. 2014-15లో ప్రారంభించిన ఈ పథకాన్ని మొదట ఎస్సీ, ఎస్టీ, ముస్ల్లింలకు అమలు చేసిన ప్రభుత్వం 2016 నుంచి బీసీలకు కూడా విస్తరించింది. ఇప్పటివరకు ఎస్సీలలో దాదాపు 80 వేల మంది, ఎస్టీలలో 48వేల మంది, బీసీలలో 87వేల మంది, ముస్లింలలో 80వేల మంది ఈ పథకంతో లబ్ధి పొందారు. ఈ పథకం కింద లబ్ధి పొందేందుకు http://epasswebsite.cgg.gov.in అను వెబ్‌సైట్‌లో దరఖాస్తులు చేసుకోవాలి

దరఖాస్తు విధానం..

* తెలంగాణ రాష్ర్టానికి చెందిన వారు మాత్రమే అర్హులు.
* దరఖాస్తుదారులు ఎస్సీ, ఎస్టీ వర్గానికి చెందిన వారై ఉండాలి.
* కుటుంబ వార్షిక ఆదాయం 2,00,000లకు మించరాదు.
* అమ్మాయి వయస్సు వివాహ సమయానికి 18 సంవత్సరాలు నిండాలి.
* ఈ పథకం అమలులోకి వచ్చిన నాటి (2014, అక్టోబర్ 2) నుంచి జరిగే వివాహాలకు మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది.
* మీ సేవ కేంద్రాలు, ఏదైనా ఇంటర్‌నెట్ కేఫ్‌లలో ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు చేసుకోవాలి.
* ఈ కింద తెలిపిన ధ్రువీకరణ పత్రాలు తప్పనిసరి దరఖాస్తు ఫారానికి జత చేయాల్సి ఉంటుంది. సర్టిఫికెట్లు అన్నీ మీ సేవ ద్వారా సంబంధిత అధికారి జారీ చేసినవై ఉండాలి.

దరఖాస్తుకు జతపర్చాల్సిన పత్రాలు…

వధూవరుల వయస్సు ధ్రువీకరణ కోసం ఎస్సెస్సీ మెమో (చదువుకున్న వారైతే) దరఖాస్తుకు జతపర్చాలి. చదువుకోని వారైతే పుట్టిన తేదీ ధ్రువీకరణ పత్రం (బర్త్ సర్టిఫికెట్)
* కుల ధ్రువీకరణ పత్రం (క్యాస్ట్ సర్టిఫికెట్)
* ఆదాయ ధ్రువీకరణ పత్రం (ఇన్‌కాం సర్టిఫికెట్)
* నివాస ధ్రువీకరణ పత్రం (రెసిడెన్సీ సర్టిఫికెట్)
(వివాహం జరిగిన తేదీ నాటికి మీ సేవ ద్వారా సంబంధిత అధికారి జారీ చేసినదై ఉండాలి)
* ఆధార్ కార్డు (వధువు, వరుడు ఇద్దరివి)
* బ్యాంకు ఖాతా (వధువు పేరు మీద జారీ చేసిన ఏదైనా జాతీయ బ్యాంకు నుంచి తీసుకు రావాలి)

పెళ్లి అయిపోతే…

ఈ పథకం కింద లబ్ధి పొందేందుకు పెళ్లికి ముందు, తర్వాత కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే పెళ్లితంతు పూర్తయిన తర్వాత దరఖాస్తు చేసుకునేవారు పైన పేర్కొన్న ధ్రువ పత్రాలతో
పాటు ఈ కింది ఆధారాలు కూడా జతపర్చాల్సి ఉంటుంది.
* శుభలేఖ (వెడ్డింగ్ కార్డు)
* పెళ్లికి సంబంధించిన ఐదు ఫొటోలు జతపర్చాలి.
* సంబంధిత అధికారులు జారీ చేసిన పెళ్లి ధ్రువీకరణ పత్రం జత పర్చాలి.

దరఖాస్తు స్వీకరణ ఎక్కడ?

ఆన్‌లైన్‌లో ఈ వివరాలు నమోదు చేసిన తర్వాత మీ సేవ లేదా ఏదైనా ఇంటర్‌నెట్ కేంద్రం వారు దరఖాస్తుకు సంబంధించి ప్రింటెడ్ కాపీ ఇస్తారు. దానిపై గెజిటెడ్ ఆఫీసర్ సంతకం
చేయించాలి. తర్వాత జిల్లాకేంద్రంలోని సాంఘిక సంక్షేమ శాఖ కార్యాలయంలో అందజేయాలి.

 

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat