టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు ప్రస్తుతం తమ పార్టీ అధినేత చంద్రబాబు నిర్ణయాలపై తీవ్ర ఆగ్రహావేశాలతో ఉన్నారు. కేవలం చంద్రబాబు ఆదేశాల మేరకు అకారణంగా ప్రతిపక్ష పార్టీ వైసీపీపై విమర్శలు గుప్పించే ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు.. జగన్ చెంతకు చేరే పనిలో ఉన్నారు. ఈ మాటలకు రుజువు కూడా లేక పోలేదు.
అవేమిటంటే.. ఇటీవల జరిగిన టీడీపీ మంత్రివర్గ విస్తరణలో ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బోండా మామహేశ్వరరావుకు ప్రాధాన్యత కల్పించకపోవడం తెలిసిన విషయమే. దీంతో కోపోద్రికులైన బోండా ఉమామహేశ్వరరావు మీడియా సాక్షిగా చంద్రబాబుపై ఉన్న తన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. తాను ఎంతో అభిమానించే తమ నాయకుడే తనకు ప్రాధాన్యత కల్పించకపోవడంతో తీవ్ర మనస్థాపానికి గురయ్యారు.
తనకు కేబినెట్‌లో స్థానం కల్పించకపోగా.. కాపు సామాజిక వర్గానికి చెందిన తనకు కనీసం పార్టీలో సముచిత స్థానం కల్పించలేదని తన సన్నిహితుల వద్ద ఉమా వాపోయారు. కాపుల గొంతు కోస్తారా అంటూ మీడియా ఎదుట చంద్రబాబును నిలదీసిన విషయం తెలిసిందే. దీంతో బోండా ఉమను పిలిపించిన చంద్రబాబు క్లాస్ పీకారట. అందులోనూ విజయవాడలో నిర్వహించిన ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమంపై ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు బోండా ఉమాకు సమాచారం ఇవ్వలేదంట. అసలే చంద్రబాబు నాయుడు తీరుతో ఆగ్రహంతో ఉన్న బోండా ఉమామహేశ్వరరావు కార్యకర్తలు, నాయకులు కూడా అధిష్టానం ఆదేశానుప్రకారమే నడచుకోవడంతో మెలమెల్లగా టీడీపీకి దూరమవుతున్నారు ఎమ్మెల్మే బోండా ఉమా.
చంద్రబాబు వ్యవహారాన్ని నిశితంగా గమనించిన ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు ఇక తనకు టీడీపీ టికెట్ రాదని భావించి వైసీపీలో చేరేందుకు సిద్ధమయ్యారట. అందులోనూ వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి చేపడుతున్న సంకల్ప పాదయాత్రతో ప్రజలకు మరింత దగ్గరవుతున్నారు కూడా. ఇప్పుడు ఇదే అంశం వైసీపీని 2019 ఎన్నికల్లో అధికారంలోకి తీసుకొస్తుందని రాజకీయ విశ్లేషకులు అంటున్న మాట విధితమే.