హైదరాబాద్ మహానగరంలో మరో సెక్స్ రాకెట్‌ను పోలీసులు గుట్టు రట్టు చేశారు. ఎల్పీనగర్లో స్పా ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తున్న ఓ ఇంటీపై పోలీసులు దాడిచేసి ఓ నిర్వాహకుడు, విటుడిని అదుపులోకి తీసుకున్నారు. అలాగే ఇద్దరు బాధిత యువతులను రక్షించి రెస్క్యూహోంకు తరలించారు. చైతన్యపురి ఠాణా పరిధిలోని నాగోలులో స్టూడియో 11 పేరిట నిర్వహిస్తున్న స్పాలో వ్యభిచారం నిర్వహిస్తున్నారన్న సమాచారంతో ఎల్బీనగర్ జోన్ ఎస్వోటీ పోలీసులు దాడిచేశారు. స్పా ఇన్‌ఛార్జి శంషాబాద్ మండలంలోని పెద్దషాపూర్‌కు చెందిన సభావత్ పాండుతోపాటు వనస్థలిపురానికి చెందిన సీహెచ్.శ్రీనివాస్ అనే విటుడిని పోలీసులు అరెస్టు చేశారు. పట్టుబడ్డ యువతులను రెస్క్యూహోంకు తరలించారు. మిజోరం, కోల్‌కతా, బెంగళూరుల నుంచి యువతులను రప్పించి స్పా ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.