ఉత్తర ప్రదేశ్‌లో మహిళలపై అరాచకాలు, అకృత్యాలు ఇప్పట్లో ఆగేట్లు కనిపించడం లేదు. తాజాగా బులంద్‌షెహర్ పట్టణంలోని ఒక మహిళపై ఆమె బావ (భర్త అన్న), అతని స్నేహితుడు కలిసి గ్యాంగ్ రేప్ చేశారు. ఈ ఘటనపై తండ్రితో కలిసి బాధితురాలు కొత్వాలీ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ నెల 1న బాధితురాలికి రషీద్‌అనే యువకుడితో వివాహం అయింది. వివాహం అయిన రెండో రోజే అమెపై భర్త అన్న, అతని స్నేహితుడు అత్యాచారం చేశారు. ఈ ఘటన తరువాత వారం రోజులకే భర్త బాధితురాలికి ట్రిపుల్ తలాక్ చెప్పి విడాకులు ఇచ్చాడు. దీనిపై బాధితురాలు డిసెంబర్ 11న కొత్వాలీ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ చొరవతో.. భర్త, అతని అన్న, స్నేహితుడు, ఇతర కుటంబ సభ్యులపై కేసు నమోదు అయింది.
పెళ్లయిన రెండోరోజే భర్త.. ఆమెను ఇంట్లో వదలిపెట్టి బయటకు వెళ్లాడు. సరిగ్గా ఇదే సమయంలో బావ మహమ్మద్ రఖీబ్, అతని స్నేహితుడు ఇంట్లోకి వచ్చారు. ఇద్దరూ కలిసి నన్ను బలవంతంగా గదిలోకి ఎత్తుకెళ్లి నాపై ఒకరితరువాత ఒకరు అత్యాచారం చేశారు. అదే సమయంలో రఖీబ్ అత్యాచారం చస్తున్న సమయంలో అతని స్నేహితుడు మొబైల్‌లో వీడియో తీశాడని చెప్పారు. ఈ ఘటనను ఎక్కడైనా చెబితే.. వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానని బెదిరించినట్లు బాధిత యువతి తెలిపింది.
ఈఘటన మొత్తం భర్తకు చెప్పాకే తెలిసింది.. అతని మోసం. అతనికి అప్పటికే వివాహం అయిందని.. అన్న కోసమే నిన్ను ఇక్కడకు తీసుకువచ్చానని చెప్పారు. ఇక అక్కడ ఉండి లాభం లేదనుకుని.. పారిపోయి పుట్టింటికి వచ్చి.. తల్లిదండ్రుల సాయంతో కేసు పెట్టినట్లు ఆమె తెలిపారు. ఇదిలా ఉండగా.. పరారీలో ఉన్న నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. మరోవైపు ఆ యువతి చెప్పేదంతా కట్టుకథ అని రషీద్ తల్లి కొట్టిపారేసింది. ‘నా కుమారుడు రషీద్‌కు ఎప్పుడో వివాహమైంది. అతడు మళ్లీ ఎందుకు పెళ్లి చేసుకుంటాడు. ఆమె చెప్పేదంతా పచ్చి అబద్దం. నా కుమారులిద్దరూ అమాయకులు’ అని ఆమె చెబుతోంది.