తెలుగుదేశం పార్టీ అధినేత , ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి మరో షాక్ తగలబోతుంది . త్వరలోనే తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత దేవేందర్ గౌడ్ గుడ్ బై చెప్పి కాంగ్రెస్ పార్టీలోకి చేరనునట్లు తెలుస్తుంది.తెలుగుదేశం పార్టీలో ఉంటే భవిష్యత్తు లేదనే ఉద్దేశంతోనే ఆయన ఆ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.
కుమారుడి కోసమే దేవేందర్ గౌడ్ దేవేందర్ గౌడ్ చాలా కాలంగా రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. కారణం ఏమిటనేది తెలియదు… అయితే, ఆయన కుమారుడు వీరేందర్ గౌడ్ రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరించాలని అనుకుంటున్నట్లు సమాచారం. దాంతో కుమారుడి కోసం కాంగ్రెస్ పార్టీలో చేరాలనే ఉద్దేశంతో దేవేందర్ గౌడ్ ఉన్నట్లు తెలుస్తోంది.
తెలంగాణ ఉద్యమ కాలంలో దేవేందర్ గౌడ్ తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి నవ తెలంగాణ పార్టీని స్థాపించారు. ఆ తర్వాత ఆయన చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీలో చేరారు. చివరకు సొంతగూటికి చేరుకున్నారు. అయితే టిడిపిలో భవిష్యత్తు లేకపోవడంతో పార్టీ మారాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది.