తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు తీర్చిదిద్దిన టీహబ్‌కు అభినందనల వెల్లువ కొనసాగుతోంది. తాజాగా టీహబ్ అదుర్స్ అని మరో బృందం కొనియాడింది. అమెరికా తెలుగు సంఘం ప్రతినిధులు హైదరాబాద్ టీ-హబ్ ను సందర్శించి స్టార్టప్ ల సీఈఓలతో సమావేశమయ్యారు. పలువురు ప్రతినిధులు స్టార్టప్‌లు,యాప్లలలో ఇన్వెస్ట్ చెయ్యడానికి ఆసక్తి కనబర్చారు.
టీ హబ్ అద్భుతంగా ఉందని, అదేవిధంగా ఔత్సాహికులకు మంచి వేదిక అని అమెరికాలోని నివసిస్తున్న ఎన్నారైలు ప్రశంసించారు. తెలంగాణ ప్రభుత్వం టీహబ్‌తో పాటుగా టీ బ్రిడ్జ్ ఏర్పాటు చేయడం నూతన ఆవిష్కరణలకు దక్కిన గౌరవంగా పేర్కొన్నారు. రానున్న రోజుల్లో మరిన్ని సేవా కార్యక్రమాలు చేస్తామని సంస్ధ ప్రతినిధులు తెలిపారు. ఇప్పటికే తాము మన రాష్ట్రంలో అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నట్లు తెలిపారు.