విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్ది సమాజానికి ఉపయోగపడేలా తయారు చేయాల్సిన ఉపాధ్యాయురాలే నీచానికి ఒడిగట్టింది. అతి పిన్న వయస్సు గల విద్యార్థితో అక్రమ సంబంధం కొనసాగించిన టీచర్ చివరకు గర్భవతి అయింది. ఈ విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కోర్టుమెట్లెక్కి.. పది సంవత్సరాల జైలుశిక్షను అనుభవిస్తోంది. ఈ ఘటన అమరికాలోని టెక్సాస్ నగరంలో చోటు చేసుకుంది.
వివరాలిలా ఉన్నాఇ.. టెక్సాస్ నగరంలోని ఓ ప్రైవేట్ స్కూల్లో పనిచేస్తున్న 25 ఏళ్ల యువతి అలెగ్జాండ్రియా వేరా అనే టీచర్ 13 సంవత్సరాల విద్యార్థితో అక్రమ సంబంధం కొనసాగించింది. ఈ క్రమంలోనే తొమ్మిది నెలలపాటు ఈ అక్రమ సంబంధం కొనసాగడంతో గర్భం దాల్చింది ఆ టీచర్. ఈ విషయం కాస్తా తల్లిదండ్రులకు తెలియడంతో ఆ టీచర్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో టీచర్‌ను పోలీసులు కోర్టులో ప్రవేశపెట్టడంతో జడ్జీముందు సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.
ఆ బాలుడితో యువతి అలెగ్జాండ్రియా చనువుగా ఉండేదని, అంతేగాక, బాలుడి కుటుంబానికి కావాల్సిన అవసరాలను కూడా దగ్గరుండి తీర్చేదని, వారు ఎక్కడికి వెళ్లినా బాలుడి వెంటే ఆ టీచరమ్మ ఉండేదని, సోషల్ మీడియాలో కూడా విద్యార్థితో నిత్యం టచ్‌లో ఉండేదని చెప్పడంతో న్యాయస్థానం విస్మయం వ్యక్తం చేసింది. విచారణ అనంతరం ఆ టీచరమ్మకు పదేళ్లపాటు జౌలుశిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది న్యాయస్థానం. అంతేగాక ఇలాంటి సంఘటనలు గుణపాఠంగా తీసుకుని ఇకపై ఇలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా పాఠశాలలు, పోలీసులు చర్యలు తీసుకోవాలని ఆదేశించింది కోర్టు.