నిన్న ప్రేమోన్మాది దాడిలో గాయపడిన యువతి సంధ్యారాణి ఇవాళ గాంధీ ఆసుపత్రి లో మృతి చెందిన విషయం తెలిసిందే.. ఈ క్రమంలో పోలీసుల విచారణలో నిందితుడు కార్తీక్ పలు సంచలన విషయాలు వెల్లడించినట్లు తెలుస్తోంది. సంధ్యారాణితో మూడేళ్ల నుంచి నాకు పరిచయం ఉంది. సంధ్యను ప్రాణంగా ప్రేమించా. కానీ తను నా ప్రేమను ఒప్పుకోలేదు. సంధ్య నాతో మాట్లాడటం బంద్‌చేసింది. తనకు ఫోన్ చేస్తే కొలీగ్ ఫోన్ మాట్లాడి సంధ్య జోలికి రావొద్దని బెదిరించాడు. తన కొలీగ్‌తో సంధ్య సన్నిహితంగా ఉండడంతో కుమిలిపోయా. తనను అవాయిడ్ చేసినందుకే ఈ పని చేసినట్లుగా నిందితుడు పేర్కొన్నాడు. కాగా సంధ్యారాణి హత్య కేసులో కార్తీక్‌కు మరో వ్యక్తి సహకరించినట్లుగా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
