మోడీ నాయకత్వంలో బీజేపీ కేంద్రంలో అధికారం చేపట్టిన తరువాత తీసుకున్న సంచలన నిర్ణయం పెద్దనోట్ల రద్దు అనే చెప్పాలి. నల్లధనాన్ని బయటకు లాగుతానంటూ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు ప్రధాని మోడీ ప్రణాళికాబద్ధంగా అడుగులు వేశారు. ఆ నేపథ్యంలోనే తీసుకున్న నిర్ణయం పెద్దనోట్ల రద్దు. అయితే, ఈ నోట్ల రద్దు వల్ల మొదట్లో ప్రజలు కాస్త ఇబ్బంది పడినా.. తరువాత మోడీ తీసుకున్న నిర్ణయానికి ప్రజల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చినా చివరకు.. పెద్దనోట్ల రద్దు నిర్ణయం అనుకున్న లక్ష్యాన్ని చేరుకోకపోవడంతో అటు కేంద్ర ప్రభుత్వంపై, ఇటు ఆర్బీఐపై పెదవి విరిచారు ప్రజలు.
అయితే, తాజా సమాచారం ప్రకారం ఆర్బీఐ మళ్లీ కొత్తనోట్లను తీసుకురానుంది. ఈ విషయాన్ని ఎస్బీఐ ఇటీవల చేసిన సర్వేలో వెల్లడైంది. కాగా, ఆర్బీఐ నాడు పెద్దనోట్ల రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయంతో.. ప్రస్తుత చిన్న నోట్లు, పెద్ద నోట్లు వివరాలను వెల్లడించారు ఎస్బీఐ ఉన్నతాధికారి సౌమ్యాంకా గోష్. మార్చి – 2017 నాటికి 3501 మిలియ్ల చిన్న నోట్లు , డిసెంబర్ 8 నాటికి రిజర్వు బ్యాకు 6597 బిలియన్ ల 500 నోట్లు, 3654 బిలియన్ల రెండువేల నోట్లను ఆర్బీఐ ముద్రించింది. వీటి విలువ 17787 బిలియన్లు. అయితే, డిసెంబర్ 8 నాటికి 13,324 బిలియన్ల పెద్ద నోట్లు మాత్రమే చెలమానిలోకి వచ్చాయి. అంటే ఇంకా 2,463 బిలియన్ల నోట్లు ఆర్బీఐ దగ్గరే ఉండిపోయాయని సౌమ్యాంకా గోష్ తెలిపారు.