కాంగ్రెస్ నేతలపై ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ మండిపడ్డారు .కాంగ్రెస్ నేతలు నిజాలు తెలుసుకుని మాట్లాడాలని సూచించారు.ఇవాళ టిఆర్ఎస్ఎల్పీలో అయన మీడియాతో మాట్లాడుతూ..కాంగ్రెస్ హయాంలో కార్పొరేట్ కళాశాలలు పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చాయని.. ప్రైవేట్ విద్యను ప్రోత్సహించడం వల్ల విద్యా వ్యవస్థ నాశనం అయ్యిందన్నారు.కాంగ్రెస్ హాయాంలోని ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను కూడా టిఆర్ఎస్ ప్రభుత్వమే అధికారంలోకి వచ్చాకా తీర్చిందన్నారు.
అదుపు తప్పిన విద్యా వ్యవస్థను ముఖ్యమంత్రి కేసీఆర్ మళ్లీ గాడిలో పెడుతున్నారని తెలిపారు.అన్ని వర్గాలకు నాణ్యమైన విద్య అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు.సమైక్య పాలనలో విద్యా వ్యవస్థ నిర్లక్ష్యానికి గురైందన్నారు. గతంలో ప్రైవేట్ కాలేజీలో చదవాలంటే ఆస్తులు అమ్ముకోవాల్సిన పరిస్థితి ఉండేదన్నారు.