క్రికెట్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్‌ను మంత్రి కేటీఆర్ అభినందించారు. పార్లమెంటులో సమావేశాల్లో భాగంగా గురువారం ఆయన రాజ్యసభలో మాట్లాడేందుకు సిద్ధమవగా ప్రతిపక్ష కాంగ్రెస్ సభ్యుల నిరంతరాయ ఆందోళనల కారణంగా ఆయనకు అవకాశం దక్కని సంగతి తెలిసిందే. రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు సర్దిచెప్పినప్పటికీ…కాంగ్రె
3డీ ఫార్ములా విఫలమయినప్పటికీ కీలక అంశంపై చర్చకు 4డీని తెరమీదకు తెచ్చి సచిన్ తన చిత్తశుద్ధిని చాటుకున్నారని ట్వీట్ చేశారు. ‘బహిరంగంగా ఓ విషయంపై చర్చించడం, చర్చలో ఇతరులను భాగం చేసుకోవడం వారి భావాలను వినడం, అసమ్మతి తెలియజేయడం (డిస్కస్,డిబేట్, డిసెంట్) అనే 3డీ ఫార్ములాకు అంతరాయం కలిగిన సమయంలో సచిన్ ఎంచుకున్న 4డీ (డిస్‌రప్షన్- నూతనమార్గం) ప్రశంసనీయం. ఈ మూడు అంశాలు విఫలమైనప్పుడు ఎలా వ్యక్తీకరించాలో సోషల్ మీడియా వేదికగా సచిన్ నిరూపించారు. క్రీడల పట్ల తనకున్న తపనను మరోమారు ఆయన చాటిచెప్పారు. ఇది అభినందనీయం’ అని మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు.