ఒక్కో రాజకీయ పార్టీ ఒక్కో కంపెనీతో సమానమని, పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌పెట్టిన పార్టీ అయితే ప్రస్తుతం ప్రైవేటు కంపెనీ అని చెప్పారు ఉండవల్లి అరుణ్‌కుమార్. కాగా, తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై తన టీమ్ ద్వారా చేసిన సర్వే విశేషాలను మీడియాకు వెల్లడించారు. 2019లోనూ బీజేపీ, టీడీపీ ఇద్దరూ కలిసే పోటీ చేసే అవకాశం ఉందన్నారు. ఒకవేళ భవిష్యత్తులో ఆరు రాష్ట్రాల్లో జరగనున్న ఎన్నికల్లో బీజేపీ ప్రభావం చూసిన తరువాత చంద్రబాబు నాయుడు ఒక నిర్ణయానికి వస్తాడని, అయితే, ఆ ఎన్నికల్లో బీజేపి ఓటమిపాలైతే చంద్రబాబు విడిపోయే అవకాశాలే ఎక్కువ ఉన్నాయన్నారు. బీజేపీ వాళ్లు ఎప్పటికీ అర్థం కారన్నారు.
అయితే, 2019లో జగన్‌తో పవన్ కలిసే అవకాశం ఉందా..? అన్న విలేకరి ప్రశ్నకు ఉండవల్లి సమాధానమిస్తూ.. ఇప్పటికే చంద్రబాబు పాలనపై ప్రజల్లో వ్యతిరేకత ఉన్న నేపథ్యంలో పవన్ కూడా చంద్రబాబుకు దూరంగా ఉండే అవకాశం ఉందని, అలాగని జగన్‌కు దగ్గర అయ్యే అవకాశం కూడా ఉందన్నారు. చంద్రబాబు, బీజేపీ పాత పద్ధతిలోనే పోటీ చేసి సీట్లు పంచుకుంటారని ఉండవల్లి అరుణ్‌కుమార్‌రెడ్డి అన్నారు.