గుప్తనిధుల వేటకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. కర్నూలు జిల్లా తుగ్గలి మండలం చెన్నంపల్లిలోని పురాతన కోటలో పెద్ద మొత్తంలో గుప్తనిధులు ఉన్నట్లు కొంతమంది ఇచ్చిన నివేదిక మేరకు ప్రభుత్వం తవ్వకాలను ప్రారంబించిన సంగతి తెలిసిందే . గత వారం రోజులుగా కోటలో అధికారులు తవ్వకాలు జరుపుతున్నారు. విజయనగర రాజుల కాలం నాటి నిధి నిక్షేపాలు ఉన్నట్లు పురావస్తు శాఖ అధికారులు తవ్వకాలు సాగిస్తున్నారు. అత్యాధునిక సాంకేతిక పరికరాలు, మెటల్ డిటెక్టర్ల సాయంతో ప్రభుత్వమే స్వయంగా నిధిని వెలికి తీసేందుకు ప్రయత్నిస్తోంది. మరోవైపు తవ్వకాలు జరుపుతున్న ప్రాంతంలో స్పష్టత రావడంతో ఉన్నతాధికారులు చేరుకుని, కోట చుట్టూ భారీ భద్రత ఏర్పాటు చేశారు.
పరిసర ప్రాంతాలు ప్రజలు సైతం కోట వద్దకు భారీగా చేరుకుని, ఏం జరుగుతుందోనన్న విషయాన్ని ఆసక్తిగా గమనిస్తున్నారు.తాజాగా తవ్వకాలు జరుగుతుండగా శుక్రవారం బండ రావడంతో తవ్వకాలకు బ్రేకులు పడ్డాయి. బండను పేల్చివేసేందుకు ఉన్నతాధికారుల ఆదేశాల కోసం స్థానిక అధికారులు ఎదురుచూస్తున్నారు. మొదట్లో గుప్త నిధులని పేర్కొన్న అధికారులు చివరకు ఖనిజాల కోసమంటూ మాటమార్చారు.