అవును మీరు చదివింది నిజమే. గ్రామం.. గ్రామం వేశ్య వృత్తిలోకి దిగింది. ఏకంగా 65 మంది యువతులు ఇప్పటికే వేశ్యవృత్తిలో కొనసాగుతుండగా.. ఇంకా ఒకరి తరువాత.. మరొకరు ఇలా ఒక్కొక్కరుగా పడక వృత్తిని ఎంచుకునేందుకు వెళ్తున్నారు. ఈ వృత్తి చేస్తూ సమాజంలో తలెత్తుకు తిరగలేము అని తెలిసినా.. కుటుంబ పోషణ నిమిత్తం తప్పడం లేదంటున్నారు.
ఇంతకీ ఆ గ్రామం ఎక్కడుంది..? మహిళలు వేశ్య వృత్తిని ఎంచుకోవడానికి కారణమేంటి..? అనేగా మీ డౌటు. అక్కడికే వస్తున్నా. ఈ గ్రామం ఎక్కడో లేదండీ మన దేశంలోని ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నో నగారానికి సమీపంలోగల నాట్పుర అనే గ్రామం. అయితే, మగవారు తమ బాధ్యతను మరిచినప్పుడు తమకు ఈ వేశ్య వృత్తేగతి అని అంటున్నారు అమ్మాయిలు.
అయితే, వ్యభిచార వృత్తిలో ఉన్న యువతులు.. వారికి పెళ్లి అయిన తరువాత ఆ వృత్తికి రాం రాం చెబుతారు. పెళ్లికాని అమ్మాయిలు మాత్రం ఆ వృత్తిలో కొనసాగుతూనే ఉంటారు. వీరంతా నాట్పుర గ్రామానికి పక్కనే ఉన్న పట్టణంలో ఈ వేశ్య వృత్తిని కొనసాగిస్తుండటం గమనార్హం.