ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత ,ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి దాదాపు నలబై రోజుల నుండి ప్రజాసంకల్ప యాత్ర పేరిట పాదయాత్ర నిర్వహిస్తున్న సంగతి తెల్సిందే.ప్రస్తుతం జగన్ మంత్రిపరిటాల సునీత సొంత ఇలాఖా అనంతపురం జిల్లాలో పాదయాత్ర నిర్వహిస్తున్నారు .
ఈ క్రమంలో నల్లమాడకు చెందిన మాజీ సీనియర్ ఎంపీటీసీ ,టీడీపీ నేత డి.కుళ్లాయి నాయక్ టీడీపీ పార్టీకి రాజీనామా చేశారు .దీనికి సంబంధించిన ఒక ప్రకటనను ఆయన మీడియాకు విడుదల చేశారు .తన రాజీనామా లేఖను స్థానిక టీడీపీ అధ్యక్షుడుకి ,రాష్ట్ర టీడీపీ పార్టీ అధ్యక్షుడికి పంపించారు .
అంతే కాకుండా నల్లమాడలోని ముప్పై పడకల ఆస్పత్రి అభివృద్ధి కమిటీ పదవికి ఆయన రాజీనామా చేశారు . నల్లమాడ లో పాదయాత్ర చేస్తున్న వైసీపీ అధినేత వైఎస్ జగన్ సమక్షంలో ఆయనతో పాటుగా వేలాది సంఖ్యలో గిరిజన్లు వైసీపీ పార్టీ తీర్ధం పుచ్చుకున్నారు .