పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ 1997 మే 17న నందిని అనే మహిళతో పెద్దల సమక్షంలో పెళ్లి జరిగిన విషయం తెలిసిందే. ఆ తరువాత వీరిద్దరి మధ్య కొన్ని మనస్పర్ధలు రావడంతో పెళ్లి అయిన సంవత్సరానికే పుట్టింటికి వెళ్లిపోయింది నందిని. అయితే, పవన్ కల్యాణ్ తన తీరును మార్చుకోకపోవడంతో మార్చి 2007న పవన్ కల్యాణ్‌కు లీగల్ నోటీసులు పంపింది నందిని.
అంతకు ముందే 1997 ఏప్రిల్‌లోనే విడాకులు తీసుకునేందుకు పవన్ కల్యాణ్ మొగ్గు చూపాడట. నందిని పవన్ కల్యాణ్‌తో మనస్పర్ధల కారణంగా వైజాగ్ వెళ్లిపోయినా అక్టోబర్ 2005 వరకు హైదరాబాద్ వచ్చిన ప్రతీ సారి పవన్ కల్యాణ్‌ను కలిసేదని, ఆ సమయంలోనే రేణుదేశాయ్‌తో పవన్ కల్యాణ్ సహజీవనం చేస్తున్నాడని తెలుసుకున్న నందిని 2005 నవంబర్ నుంచి పవన్ కల్యాణ్‌తో మాట్లాడటమే మానేసింది.
ఆ తరువాత జరిగిన పరిణామాలతో తనకు మెయింటెనెన్స్ కోసం నెలకు రూ.5 లక్షలు కావాలని కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఆగస్టు 2008న వీరికి విడాకులు మంజూరు చేసింది కర్టు. అయితే, నందిని పవన్ కల్యాణ్ నుంచి విడాకులు తీసుకున్న తరువాత తన పేరును జాహ్నవిగా మార్చుకోవడం గమనార్హం.
2010 మే 16న గ్రాండ్ కాకతీయ హోటల్లో పింగళి రణదీర్‌రెడ్డి, సుధ దంపతుల కుమారుడైన డా.కృష్ణారెడ్డిని వివాహం చేసుకుంది జాహ్నవి (నందిని)