ప్రపంచంలో ఎక్కువ గౌరవాన్ని పొందే వృత్తి ఏమిటంటే.. ఆలోచన లేకుండా వచ్చే సమాధానం వైద్య వృత్తి. ప్రస్తుత సమాజంలో ప్రతి ఒక్కరు ఏదో ఒక సమయంలో వైద్యుడ్ని సంప్రదించాల్సిందే. తమకు వైద్యం చేసిన డాక్టర్‌ను కృతజ్ఞతతో తలుచుకోవడం కూడా సర్వసాధరణమే. వైద్యం చేసినందుకుగాను ఆ సదరు డాక్టరు డబ్బును, గౌరవాన్ని పొందుతాడు కూడా.
అయితే, తమిళనాడు రాజధాని చెన్నైలో అందుకు విరుద్దంగా జరిగింది. వైద్యం నిమిత్తం వచ్చిన ఓ మహిళను వివస్ర్తను చేసి లైంగిక దాడి చేశాడు. సంఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి. చెన్నైకు చెందిన రాణి అనే అమ్మాయికి ఆరు నెలల క్రితం వివాహమైంది. అయితే, భర్తతో ఆ విషయంలో పాల్గొన్న ప్రతీ సారి తనకు భరించలేని నొప్పి వస్తుందని.. ఆ విషయం తన భర్తకు చెబితే ఏమంటాడోనన్న భయంతో తన ఫ్రెండ్‌తో తన బాధను పంచుకుంది. రాణి బాధను విన్న స్నేహితురాలు ఓ సక్సాలజిస్ట్ వద్దకు తీసుకెళ్లింది. దీంతో మొదటి చూపులోనే రాణిపై కన్నేసిన ఆ వైద్యుడు చికిత్స పేరుతో ఒక వారం రోజులపాటు తన వద్దకు పిలిపించుకున్నాడు.
ఆ వారం రోజులు తన ప్రెండ్తోనే వైద్యం నిమిత్తం సెక్సాలజిస్ట్ వద్దకు పోయిన రాణి.. ఒక రోజు తన ఫ్రెండ్ లేకుండా వైద్య నిమిత్తం వెళ్లింది. తన ఫ్రెండ్లేని విషయాన్ని గమనించిన ఆ వైద్యుడు రాణికి 70 శాతం నిద్రలోకి వెళ్లేలా మత్తు మందు ఇచ్చాడు. అనంతరం రాణిని వివస్ర్తను చేసి.. లైంగిక దాడిక పాల్పడ్డాడు. వైద్యుడు ఏం చేస్తున్నాడోనన్నది తెలిసినా కూడా ఏం చేయలేని పరిస్థితి రాణిది. మత్తు మందు విడిచిన తరువాత మేల్కొన్న రాణి తనపై జరిగిన లైంగిక దాడి గురించి ఆ వైద్యుడ్ని ప్రశ్నించింది. అదంతా చికిత్సలో భాగమేనంటూ చెప్పుకొచ్చాడు. ఈ విషయాన్ని కాస్తా తన ఫ్రెండ్‌కు తెలిపింది రాణి. అనంతరం తన ఫ్రెండ్ సహాయంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది కూడా.
బాధితురాలు రాణి పేరు బయటకు రాకుండా ఆ సెక్సాలజిస్ట్‌ను లాకప్‌లో వేసి ఇరగ్గొట్టారు పోలీసులు. అర్థరాత్రి ఆడ పిల్ల తిరిగిన నాడే అసలైన స్వాతంత్ర్యం వచ్చినట్లు అంటూ గాంధీ అన్న మాటలు మనకు విధితమే. ప్రస్తుత సమాజంలో పట్టపగలే లైంగిక దాడులు జరుగుతున్నాయి. నిత్యం ఎక్కడో ఒక చోట మహిళలపై దాడులు జరుగుతూనే ఉండటం గమనార్హం.