తమిళనాడు రాష్ట్రంలోని ఆర్కేనగర్ నియోజకవర్గానికి ఇవాళ జరుగుతున్న ఉపఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. జయలలిత మరణంతో ఖాళీ అయిన ఆర్కేనగర్‌పై రాజకీయంగా తీవ్ర పోటీ నెలకొంది. మొత్తం 59మంది అభ్యర్థులు బరిలోకి దిగారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సాయంత్రం 5గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఈ నెల 24న ఓట్ల లెక్కింపు జరగనుంది.
