గత కొన్ని రోజులుగా సోషల్ మీడియా వేదికా బాగా ట్రెండ్ అవుతున్న వార్త ఏమిటయ్యా అంటే టక్కున గుర్తుకొచ్చేది రెబల్‌స్టార్ ప్రభాస్, కొణిదెల వారి డాటర్ నిహారిక పెళ్లి. ఇప్పుడు ఇదే వార్తను టాలీవుడ్ ప్రపంచం కోడై కూస్తోంది. అయితే, ఈ విషయంపై ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి, తమ్ముడు నాగబాబులు స్పందించారు కూడా. వారు మాట్లాడుతూ.. సోషల్ మీడియాపై అసహనం వ్యక్తం చేశారు. అసలు నిహారికతో ప్రభాస్‌కు పెళ్లి ఏంటి అంటూ ఎదురు ప్రశ్నించారు కూడా.
తాజాగా ఇదే వార్తపై నిహారిక స్పందించింది. తనకు, ప్రభాస్‌కు పెళ్లి అంటేనే తనకు నవ్వొస్తుందని, ప్రభాస్ తనకు అన్నయ్య లాంటి వాడు అంటూ చెప్పుకొచ్చింది. తనకు ఇప్పుడే పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదని, ఇప్పటికే తాను నాన్న కూచీనేనని చెప్పింది. తన పెళ్లి విషయంలో తన పెదనాన్న, నాన్న, బాబాయ్, తన అన్నయ్యలదే ఫైనల్ డెసీషన్ అని, ఇంతకు ముందు సాయిధరమ్‌తేజ్‌తో.. మరి ఇప్పుడేమో ప్రభాస్‌తో తనకు పెళ్లి అంటూ వార్తలు రాసేస్తున్నారు అంటూ మండిపడింది. అయితే, ప్రస్తుతం నిహారిక తమిళ సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే.