పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ తాజాగా నటించిన చిత్రం అజ్ఞాతవాసి. మొన్నీమధ్యనే ఆడియో రిలీజ్ ఫంక్షన్ జరుపున్న ఈ చిత్రం వెండితెరపై ప్రదర్శనకు సిద్ధమవుతోంది. రానున్న జనవరి 10న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఆ ఫంక్షన్‌లో అనిరుద్ లైవ్ షో చేశాడే కానీ అది లైవా, ట్రాకా అర్ధం కాకుండానే అలా ముగిసిపోయింది. ఇక స్పీచులు. రూలు ప్రకారం అందరూ పవన్ కళ్యాణ్ ని పొగిడారు. ఫ్యాన్స్ కేకలు కామన్. అయితే ఈసారి కొంచెం డిఫరెంట్‌గా సీయం.. సీయం.. అని అరిచారు. బహుశా ఫ్యాన్స్ ఇప్పుడు పొలిటికల్ మూడ్ లోకి వెళ్ళిపోయారనుకోవాలి.
అయితే, ఈ కార్యక్రమంలో పవన్ కల్యాణ్ మాట్లాడిన మాటలు అందరిని ఆకట్టుకున్నాయని చెప్పుకోవాలి, ముఖ్యంగా తన ప్రియమిత్రుడు డైరెక్టర్ త్రివిక్రమ్ గురించి పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. ఆయనో గొప్ప దర్శకుడు. ప్రతీ సారి నేను త్రివిక్రమ్‌కు సలహాలు ఇస్తుంటాను అనే కామెంట్స్ తనకు ఈ మధ్య వినపడ్డాయని, ఆ కామెంట్స్‌ను పవన్ కల్యాణ్ ఖండించారు. ఆయనో పెద్ద మేధావి, పెద్ద డైరెక్టర్, అంతేగాక నా కష్టాల్లో పాలుపంచుకున్నాడు, వెన్నంటి ఉన్నాడు. అంటూ ఆడియో ఫంక్షన్‌లో త్రివిక్రమ్ గురించి పవన్ చెబుతూ ఉద్వేగానికి లోనయ్యాడు.
ఈ విషయంపై సినీ క్రిటిక్ కత్తి మహేష్ మాట్లాడుతూ.. అజ్ఞాతవాసి ఆడియో ఫంక్షన్ మొత్తం త్రివిక్రమ్ పవన్ కల్యాణ్‌ని, పవన్ కల్యాణ్ త్రివిక్రమ్‌ని.. ఒకరికొకరు పొగడటానికే సరిపోయిందని, కనీసం ట్రైలర్ కూడా మనకు చూపెట్టలేదని కామెంట్స్ చేశాడు. సో లెట్స్ వెయిట్ జాన్ 10 అంటూ ఎటువంటి వివాదం లేకుండా కత్తి మహేష్ స్పందించారు. ఈ కామెంట్స్ కాస్తా విన్న సినీ జనం.. కత్తి మహేష్ విమర్శల్లో పస తగ్గిపోయిందని, అందుకే ఈ మధ్య సైలెంట్ అయ్యాడంటూ తమదైన శైలిలో కామెంట్స్ చేస్తున్నారు.