రాష్ట్ర ఐటీ శాఖా మంత్రి కేటీఆర్ స్మార్ట్, యంగ్ లీడర్ అని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖా మంత్రి హర్దీప్సింగ్ పూరి ప్రశంసించారు. బుధవారం ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో బిజినెస్ వరల్డ్ అవార్డును ప్రకటించిన లీడర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును మంత్రి కేటీఆర్‌కు కేంద్ర మంత్రి అందించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని కేంద్ర మంత్రి ట్వీట్ చేశారు.
Was an honour to hand over a well deserved award to @KTRTRS a smart & young leader. https://t.co/IvGKmSFjKp
— Hardeep Singh Puri (@HardeepSPuri) December 21, 2017
‘మంత్రి కేటీఆర్‌కు ఈ అవార్డును అందించడం నాకు దక్కిన గౌరవంగా భావిస్తున్నాను. ఆయన ఈ అవార్డుకు పూర్తి అర్హులు. మంత్రి కేటీఆర్ స్మార్ట్, యంగ్ లీడర్’ అని ప్రశంసించారు. దీనికి మంత్రి కేటీఆర్ స్పందిస్తూ…‘చాలా కృతజ్ఞతలు సర్’ అని తెలిపారు.
??? Many Thanks Sir https://t.co/weRaqAPVNo
— KTR (@KTRTRS) December 21, 2017
ఇదిలాఉండగా…… రాష్ట్ర ఐటీ, పురపాలక, పరిశ్రమలశాఖ మంత్రి కే తారక రామారావు ప్రతిష్ఠాత్మకమైన అర్బన్ లీడర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును అందుకున్నారు. బుధవారం సాయంత్రం ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ మంత్రి హర్దీప్సింగ్ పూరి చేతులమీదుగా అవార్డు స్వీకరించారు. పట్టణాభివృద్ధి, స్వచ్ఛత, మౌలిక సదుపాయాల కల్పన, ఉత్తమ నగరాలుగా ప్రతిభ కనబరిచిన సంస్థలకు, నగరాలకు, వ్యక్తులకు బిజినెస్ వరల్డ్ సంస్థ అవార్డులు ప్రకటించగా.. అందులో తెలంగాణకు రెండు అవార్డులు వచ్చిన విషయం తెలిసిందే. అర్బన్ లీడర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును మంత్రి కేటీఆర్ అందుకోగా, పట్టణాభివృద్ధికి మౌలిక వసతులు కల్పిస్తున్న రాష్ట్రంగా తెలంగాణకు దక్కిన మరో అవార్డును రాష్ట్ర పట్టణాభివృద్ధిశాఖ కార్యదర్శి నవీన్‌మిట్టల్ అందుకున్నారు.