కొత్త రాష్ట్రం అయిన తెలంగాణ అనేక రంగాల్లో నెంబర్ స్థానంలో నిలిచిందని రాష్ట్ర మార్కెటింగ్ శాఖ మంత్రి హరీష్ రావు అన్నారు. అన్ని రంగాల్లో ప్రథమ స్థానంలో ఉందని పేర్కొన్నారు. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ పథకాలలో కూడా నెంబర్ స్థానంలో ఉండటం సంతోషకరమన్నారు.
97 శాతంతో మన రాష్ట్రం గిడ్డంగులను ఉపయోగించుకోవడంలో ప్రథమ స్థానములో నిలిచిందని పేర్కొన్నారు. ద్వితీయ స్థానంలో ఆంధ్రప్రదేశ్, ఉత్తర ఖండ్, చివరి స్థానములో గుజరాత్ నిలిచిందని వివరించారు. ఈ సందర్భంగా మా ఎండీ గారిని మిగతా ఉద్యోగులను అభినందిస్తున్నానని మంత్రి అన్నారు. ఎర్రమంజిల్ లోని జలసౌదా లో తెలంగాణ రాష్ట్ర గిడ్డంగుల సంస్థ సమీక్ష సమావేశం కు హాజరైన మంత్రి హరీష్ రావు, గిడ్డంగుల సంస్థ చైర్మన్ మందుల సామెల్ ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
మార్కెటింగ్‌లో ఇప్పటికే నిజామాబాద్ ఈనామ్‌లో నెంబర్ 1 స్థానంలో నిలిచిందని మంత్రి హరీశ్‌రావు సంతోషం వ్యక్తం చేశారు. 97 శాతంతో నెంబర్ 1 గా ఉన్నప్పటికీ మరింత ముందుకు వెళ్ళాలని చూశారు. మిషన్ కాకతీయ ద్వారా చెరువులో ఉన్న మట్టిని పంటపొలలో పోయడం ద్వారా పంట దిగుబడి అధికంగా పెరిగిందని గిడ్డంగుల సంస్థ చైర్మన్ మందుల సామెల్ అన్నారు. తెలంగాణ రైతాంగం బోర్ బావుల ద్వారా వ్యవసాయము చేస్తారని…అందుకే ముఖ్యమంత్రి కేసీఆర్ 24 గంటలు కరెంట్ ఇవ్వాలని నిర్ణయించారన్నారు.